UPSC Civils results: యూపీఎస్సీ సివిల్స్, 2023 (UPSC CSE final results) తుది ఫలితాలు విడుదల అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి ఉద్యోగాలను ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా యూపీఎస్సీ భర్తీ చేస్తుంది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 (UPSC CSE final results) లో మొత్తం 1016 మంది ఉత్తీర్ణులయ్యారని యూపీఎస్సీ వెల్లడించింది. 2022-23 యూపీఎస్సీ సీఎస్ఈ ఫైనల్ పరీక్షల్లో ఆదిత్య శ్రీవాస్తవ ఆలిండియా ర్యాంక్ 1 సాధించారు. రెండో ర్యాంకు సాధించిన అనిమేష్ ప్రధాన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ తుది ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు.
టాప్ 10 అభ్యర్థుల జాబితా ఇక్కడ
ర్యాంక్ 1: ఆదిత్య శ్రీవాస్తవ
ర్యాంక్ 2: అనిమేష్ ప్రధాన్
ర్యాంక్ 3: దోనూరు అనన్య రెడ్డి
ర్యాంక్ 4: పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్
ర్యాంక్ 5: రుహానీ
ర్యాంక్ 6: సృష్టి దబాస్
ర్యాంక్ 7: అన్మోల్ రాథోడ్
ర్యాంక్ 8: ఆశిష్ కుమార్
ర్యాంక్ 9: నౌషీన్
ర్యాంక్ 10: ఐశ్వర్యం ప్రజాపతి
ర్యాంక్ 11: కుష్ మోత్వానీ
ర్యాంక్ 12: అనికేత్
ర్యాంక్ 13: మేధా ఆనంద్
ర్యాంక్ 14: శౌర్య అరోరా
ర్యాంక్ 15: కునాల్ రస్తోగి
ర్యాంక్ 16: అయాన్ జైన్
ర్యాంక్ 17: స్వాతి శర్మ
ర్యాంక్ 18: వర్ధ ఖాన్
ర్యాంక్ 19: శివమ్ కుమార్
ర్యాంక్ 20: ఆకాశ్ వర్మ
ఈ ఏడాది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి నియామకాలకు మొత్తం 1016 మంది ఉత్తీర్ణత (UPSC CSE final results) సాధించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2023 మే 28న, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించారు. 2024 జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 వరకు దశలవారీగా పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహించారు.
యూపీఎస్సీ సీఎస్ఈ 2023 (UPSC CSE final results) తుది ఫలితాలను తనిఖీ చేయడానికి దశలు: