UPSC CSE Mains Result 2023: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల విడుదల; ఇలా చెక్ చేసుకోండి..-upsc cse mains result 2023 declared at upsc gov in heres how to check ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Cse Mains Result 2023: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

UPSC CSE Mains Result 2023: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Dec 08, 2023 06:43 PM IST

UPSC CSE Mains Result 2023: 2023 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది. సివిల్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

UPSC CSE Mains Result 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) డిసెంబర్ 8న 2023 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.

సెప్టెంబర్ లో పరీక్షలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 24 వరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్ (UPSC CSE Mains Result 2023) పరీక్షలను నిర్వహించింది. సివిల్ సర్వీసెస్, 2023 ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాయడానికి అర్హత కలిగి ఉంటారు. ఇప్పడు మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. “యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2023 ఫలితాల ఆధారంగా, క్రింద ఇచ్చిన రోల్ నంబర్లు, పేరు ఉన్న అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ 'ఎ' మరియు గ్రూప్ 'బి') లకు ఎంపిక చేయడానికి పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు హాజరు కావాల్సి ఉంటుంది” అని యూపీఎస్సీ నోటిఫికేషన్ వివరించింది.

How to check civil services results: ఇలా చెక్ చేయండి

  • సివిల్ సర్వీసెస్ మెయిన్స్, 2023 పరీక్ష ఫలితాలను చూసుకోవడానికి ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న UPSC Mains Result 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నంబర్ ఆధారంగా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • ఆ పీడీఎఫ్ ని డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోండి.
  • Direct link to check UPSC CSE Main result 2023

IPL_Entry_Point