Thursday Motivation: యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ నుంచి మన విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే
Thursday Motivation: యూపీఎస్సీ టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీ వాస్తవ నిలిచారు. ఆయన నుంచి నేటితరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
Thursday Motivation: ప్రతి ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు 10 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది ఒకటి. పది లక్షల మందిలో కేవలం 1000 లేదా 1100 మంది మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. 2023లో లక్నోకు చెందిన ఆదిత్య శ్రీ వాస్తవ యుపిఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొదటి స్థానాన్ని పొందారు. మొత్తం ఈ సంవత్సరం 1016 మందికి సివిల్ ర్యాంకులను కమిషన్ సిఫార్సు చేసింది.
యూపీఎస్సీ టాపర్ ఆదిత్య నుంచి మన విద్యార్థులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అతను చెప్పిన దాని ప్రకారం విద్యార్థులు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయడమే మంచిది. కష్టపడి పనిచేయడం చాలా కీలకం అని చెబుతున్నాడు. కేవలం చదువులో పైనే మాత్రమే దృష్టి పెడితే మెదడు మొద్దుబారిపోతుందని... క్రికెట్, సంగీతం వంటి ఎంటర్టైన్మెంట్ కూడా జీవితానికి ఉండాలని చెబుతున్నాడు. పరీక్షలకు ముందు మాత్రం అలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిలిపివేసి పూర్తిగా చదువు పైనే దృష్టి పెట్టాలని చెబుతున్నాడు.
డబ్బే అంతిమ ప్రేరణ కాదని... అట్టడుగు స్థాయి వారికి ప్రభావం చూపేలా మన జీవితం కొనసాగాలని చెబుతున్నాడు శ్రీవాత్సవ. ఈయన ఇప్పటికే ఐపీఎస్ సాధించాడు. 2022లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్ ని ఎంచుకున్నాడు. హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూనే మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. 2023లో అతడిని అత్యున్నత స్థానం వరించింది. అతని అంకితభావం, పట్టుదల ఆయనకు ఈ విజయాన్ని అందించాయి. వ్యక్తి ఏదైనా సాధించాలంటే అతనికి కుటుంబం మద్దతు చాలా అవసరం. ఆదిత్యకు కుటుంబం నుంచి ఎంతో ప్రోత్సాహం లభించింది.
విద్యార్థులు పాఠశాల దశ నుంచే కమ్యూనికేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతున్నారు ఆదిత్య శ్రీవాత్సవ. ఇది జీవితంలో అవసరమైన నైపుణ్యం. ఏది సాధించాలన్నా కూడా కమ్యూనికేషన్స్ ఇప్పుడు అత్యవసరంగా మారాయి. సమయ నిర్వహణ అనేది కూడా విద్యార్థులకు ఉండాల్సిన ముఖ్య సుగుణం. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేసేలా చేస్తుంది. సమర్థవంతమైన సమయ నిర్వాహణ చేసే విద్యార్థులు జీవితంలో ఏదైనా త్వరగా సాధించగలరని యూపీఎస్సీ టాపర్ అభిప్రాయం. విమర్శనాత్మక ఆలోచనలు కూడా విద్యార్థులకు ప్రయోజనాలను అందిస్తాయి. వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. వృత్తిపరమైన జీవితంలోని సవాళ్లను ఈ విమర్శనాత్మకమైన ఆలోచనలు త్వరగా సాల్వ్ చేస్తాయి. విద్యార్థులకు సృజనాత్మకత చాలా అవసరం ఇది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. నాయకత్వం అనేది ముఖ్యమైన వృత్తిపరమైన నైపుణ్యం. ఈ నైపుణ్యం విద్యార్థులు తమపై తాము నమ్మకాన్ని పెంచుకునే విధంగా చేస్తుంది. ఇతరులపై ఆధారపడే అవకాశాలను తగ్గిస్తుంది.