Rashtriya Military Schools: మిలటరీ స్కూల్స్ లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి
Admissions in Rashtriya Military Schools: దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో ఆరవ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది.
Admissions in Rashtriya Military Schools: 2024-2025 విద్యా సంవత్సరంలో కోసం దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో 6వ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇవే మిలటరీ స్కూల్స్..
చాయల్ (హిమాచల్ ప్రదేశ్), అజ్మీర్ (రాజస్తాన్), బెల్గాం (కర్నాటక), బెంగళూరు (కర్నాటక), ధోల్ పూర్ (రాజస్తాన్) ల్లో ఉన్న రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో 6వ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు.ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్‌లు.
అర్హతలు..
6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2024 మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ మరియు 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. 9వ తరగతిలో ప్రవేశానికి, 2024, మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ మరియు 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. 6వ తరగతిలో బాలబాలికలు ఇద్దరికీ ప్రవేశం కల్పిస్తుండగా, 9వ తరగతిలో మాత్రం అబ్బాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
పరీక్ష
ఈ రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్ లో అడ్మిషన్ పొందడానికి ముందుగా రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మీ) నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ తదితర వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. అప్లికేషన్ ఫామ్ లను అక్టోబర్ 18వ తేదీ లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.