తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Video: ఎస్ఐ కారు కింద భారీ బాంబు - ఉగ్రవాదుల పనేనా!

Video: ఎస్ఐ కారు కింద భారీ బాంబు - ఉగ్రవాదుల పనేనా!

17 August 2022, 8:28 IST

పంజాబ్ లోని అమృత్‌సర్‌లో భారీ పేలుడు తప్పింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అమృత్‌సర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ దిల్ బాగ్ సింగ్ కారు కింద కొందరు అగంతకులు ఐఈడీ (IED)ని అమర్చారు. గుర్తించిన నిఘా బృందం... వెంటనే బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దింపి నిర్వీర్యం చేశారు. దిల్ బాగ్ సింగ్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఇద్దరు అగంతకులు ఆయన కారు కింద ఈ బాంబును అమర్చినట్టు పోలీసులు గుర్తించారు. గతంలో యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్ లో క్రియాశీలకంగా ఉన్నందునే తనను ఉగ్రవాదులు టార్గెట్ చేసి ఉండవచ్చని చెప్పారు సబ్ ఇన్‌స్పెక్టర్ దిల్ బాగ్ సింగ్. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పేలుడు పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.….