తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Modi Cabinet : మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలైకి చోటు! నేడు మొత్తం 30 మంది ప్రమాణం!

Modi cabinet : మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలైకి చోటు! నేడు మొత్తం 30 మంది ప్రమాణం!

Sharath Chitturi HT Telugu

09 June 2024, 11:44 IST

google News
  • మోదీ కేబినెట్ 3.0: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్టు సమాచారం. మోదీ సహా మొత్తం 30మంది నేడు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలై !
మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలై ! (ANI )

మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలై !

Modi 3.0 cabinet : ఆదివారం సాయంత్రం.. భారత దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోదీ. కాగా.. మోదీ 3.0 కేబినెట్​లో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరికి ఏ మినిస్ట్రీ ఇస్తారు? అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటన్నింటి మధ్య.. మరో వార్త బయటకు వచ్చింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని సమాచారం!

మోదీ కేబినెట్​లో అన్నామలైకి చోటు..!

మోదీ 3.0 కేబినెట్​లో అన్నామలైకి సహాయమంత్రిగా చోటు కల్పించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండగా, రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు కేబినెట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 

Modi oath ceremony : 2024 లోక్​సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అన్నామలై.

ఇక నరేంద్ర మోదీ మంత్రివర్గంలో దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తం 78-81 మంది మంత్రుల వరకు మోదీ కేబినెట్​లో ఉంటారని, కానీ ఆదివారం మాత్రం 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని జాతీయ వార్తా సంస్థ ఎన్డీటీవీ తెలిపింది.

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదన్న విషయం తెలిసిందే. టీడీపీ, జేడీయూ వంటి ఎన్డీఏ మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆయా పార్టీలు.. మోదీ కేబినెట్​లో కీలక డిమాండ్లు చేశాయి. అయితే.. కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ దగ్గరే ఉంటాయని తెలుస్తోంది. హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆర్థికశాఖ, రక్షణశాఖ వంటివి బీజేపీ దగ్గరే ఉంటాయని సమాచారం.

టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్​కు మోదీ 3.0 కేబినెట్​లో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, జేడీయూ కి లభించే రెండు కేబినెట్ బెర్త్ ల్లో సీనియర్ నాయకులైన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు అవకాశం లభించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Rammohan naidu union cabinet : మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వారిలో బొగ్గు, పౌర విమానయానం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, ఉక్కు వంటి కీలక శాఖలకు చెందిన మంత్రులు కూడా ఉంటారని ఎన్డీటీవీ తెలిపింది.

ఇక నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి దేశ విదేశాల నుంచి కీలక నేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్​, నేపాల్​, భూటాన్​ ప్రధానులు, మాల్దీవులు, శ్రీలంక అధ్యక్షులు మొదలైన వారు.. హజరవుతారు. ఇక కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సైతం మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని సమాచారం.

PM Modi latest news : మరోవైపు మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దిల్లీ ముస్తాబైంది. దేశ రాజధాని.. భారీ భద్రతా వలయంలోకి జారుకుంది. క్షేత్రస్థాయి భద్రతతో పాటు, దిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) పై నో-ఫ్లై జోన్​గా ప్రకటిస్తూ దిల్లీ పోలీసులు శుక్రవారం పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం