Lok Sabha election results 2024 : అన్నామలై నుంచి స్మృతీ ఇరానీ వరకు.. అగ్ర నేతలకు షాక్ ఇచ్చిన ప్రజలు!
Lok Sabha election results 2024 : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు ఈ ఎన్నికల్లో.. ప్రజలు షాక్ ఇచ్చిన అగ్రనేతల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Lok Sabha election results : 2024 లోక్‌సభ ఎన్నికల్లో సంచలనం! 400 పార్ నినాదంతో బరిలో దిగిన ఎన్డీఏకి ఈసారి 300 సీట్లు కూడా రాకపోవచ్చని లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తుంటే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. బీజేపీ అగ్రనేతల్లో చాలా మంది ఓటమి అంచున నిలబడ్డారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కోయంబత్తూర్..
తమిళనాడులోని కొయంబత్తూర్ కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచింది. ఇందుకు ముఖ్యం కారణం.. అక్కడి బీజేపీ అభ్యర్థి అన్నామలై. తమిళనాడులో అసలు ప్రభావమే చూపని పార్టీ.. తన భుజాల మీద మోస్తూ, అన్నీ తానై చుసుకున్న అన్నామళై.. కొయంబత్తూర్ నుంచి గెలిచి, రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరుస్తారాని అందరు భావించారు. కానీ.. డీఎంకే ప్రత్యర్థి గణపతి రాజ్‌కూమార్ చేతిలో ఓటమికి అడుగు దూరంలో నిలిచారు. ప్రస్తుతం.. దాదాపు 19వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు అన్నామలై.
అమేఠీ..
Smriti Irani Lok Sabha election results : 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేఠీలో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడించారు. అయిదేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రత్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ 64 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ వరుసగా రాహుల్ గాంధీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
తిరువనంతపురం..
మూడుసార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశిథరూర్‌పై పోటీ చేసేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశిథరూర్ 2009, 2014, 2019లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈసీఐ ట్రెండ్స్ ప్రకారం శశిథరూర్ బీజేపీ నేతపై 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రాజీవ్ చంద్రశేఖర్.
గురుగ్రామ్..
2024 Lok Sabha election results : లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గుర్ గావ్ రాజ్ బబ్బర్‌ను హర్యానాలోని గుర్గావ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేసింది పార్టీ. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన కేంద్ర మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ పై ఆయన పోటీకి దిగారు. అయితే ఈసీ ట్రెండ్స్ ప్రకారం బబ్బర్ 32,538 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇది బీజేపీకి షాక్ కలిగించే వార్తే!
ఫరూక్ అబ్దుల్లా..
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బారాముల్లా జమ్ముకశ్మీర్‌లో తొలి ఎన్నికలు జరుగుతున్నాయి. బారాముల్లాలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా.. అబ్దుల్ రషీద్ షేక్ కంటే వెనుకంజలో ఉన్నారు.
అనంత్ నాగ్-రాజౌరీ..
Lok Sabha election results BJP : మరో జమ్ముకశ్మీర్ స్థానం అనంతనాగ్-రాజౌరి నియోజకవర్గం. దశాబ్దాలుగా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా ఉన్న ఈ స్థానం మార్పు దిశగా పయనిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఎన్సీ అభ్యర్థి మియాన్ అల్తాఫ్ అహ్మద్ కంటే 1,38,303 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
అధిర్ రంజన్..
ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి పశ్చిమబెంగాల్ లోని బహరంపూర్ లో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నిర్మల్ కుమార్ సాహా 1,559 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు.
సంబంధిత కథనం