Lok sabha elections results: మెట్రో నగరాల్లో బీజేపీకి పెరిగిన ఆదరణ-lok sabha election bjp leading in indias metros set to increase vote share ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections Results: మెట్రో నగరాల్లో బీజేపీకి పెరిగిన ఆదరణ

Lok sabha elections results: మెట్రో నగరాల్లో బీజేపీకి పెరిగిన ఆదరణ

HT Telugu Desk HT Telugu
Jun 04, 2024 01:08 PM IST

Lok Sabha election results: ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని 30 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. తాజా ట్రెండ్స్ ప్రకారం 2019లో 39 శాతంగా ఉన్న ఓట్ల శాతం.. 2024 లో 44 శాతానికి పెరిగింది.

హైదరాబాద్ లో పెరిగిన ఓట్ల శాతం
హైదరాబాద్ లో పెరిగిన ఓట్ల శాతం

BJP Vote share in Metros: ప్రగతి కేంద్రాలుగా భావించే భారతదేశ పట్టణ కేంద్రాల్లోని పోలింగ్ శైలి అర్బన్ ఓటర్ల మనోగతాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. భారతదేశంలోని ఆరు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు ల్లో ఎంపిక చేసిన 30 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గణనీయ స్థాయిలో ఓట్లను సాధించింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, 2019లో 39% ఓట్లు సాధించగా, 2024 లో (ఉదయం 12 గంటల సమయానికి) 44.4 శాతం ఓట్లు సాధించింది. 2014 లో ఈ మెట్రో నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం 32 మాత్రమే కావడం గమనార్హం.

కాంగ్రెస్ కు కూడా పెరిగిన ఓట్లు

తాజా గణాంకాల ప్రకారం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 17.8 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. ఈ మెట్రో నియోజకవర్గాల్లో 2009లో 26 శాతంగా ఉన్న కాంగ్రెెస్ ఓట్ల శాతం 2014లో 15 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 21 శాతానికి పెరిగింది. భారతదేశంలోని మొత్తం ఓటర్లలో భారతదేశంలోని ఆరు అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరుల్లోని నియోజకవర్గాల్లో దాదాపు 6.2% మంది ఉన్నారు.

‘నోటా’ ను పట్టించుకోవడం లేదు

2014లో తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన 'నోటా' ఆప్షన్ ను 2019లో 1 శాతం, 2014లో 0.9 శాతం ఓటర్లు ఉపయోగించుకున్నారు. కానీ, 2024లో కేవలం 0.7 శాతం ఓటర్లు మాత్రమే ‘నోటా’ కు ఓటేశారు. కాగా, ఈ ఏడాది ఈ 6 మెట్రో నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. కోల్ కతాలో 2024లో ఓటింగ్ శాతం అత్యధికంగా తగ్గింది. కోల్ కతాలో 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం 4.7 శాతం పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో 59.7 శాతం నుంచి 56 శాతానికి పోలింగ్ తగ్గింది. ఢిల్లీలో ఓటింగ్ శాతం 60.5 శాతం నుంచి 58.7 శాతానికి తగ్గింది. 47.4 శాతం నుంచి 49.7 శాతానికి పెరిగిన ఏకైక మెట్రో హైదరాబాద్ కావడం గమనార్హం.

Whats_app_banner