తెలుగు న్యూస్  /  National International  /  Supreme Court Rejects Abdullah Azam Khans Plea Challenging Allahabad Hc Order Annulling His Election

Fake birth certificate case: ఆజాం ఖాన్ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం..

HT Telugu Desk HT Telugu

07 November 2022, 12:24 IST

    • Fake birth certificate case: హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆజాం ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఆజం ఖాన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఆజం ఖాన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు (PTI)

ఆజం ఖాన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

అబ్దుల్లా ఆజం ఖాన్ వయస్సు తక్కువగా ఉందని, 2017లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదని చెబుతూ ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పును సవాలు చేస్తూ అబ్దుల్లా ఆజం ఖాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి గెలిచిన అబ్దుల్లా ఖాన్‌కు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. అబ్దుల్లా ఖాన్ మార్చి 11, 2017న సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అబ్దుల్లా సమర్పించిన జనన ధృవీకరణ పత్రం నకిలీదని గుర్తించిన హైకోర్టు ఆ ఎన్నికను పక్కన పెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆయన వయస్సు నిర్ధిష్ట నిబంధనల కంటే తక్కువగా ఉందని, 25 ఏళ్లలోపే ఉన్నారని చెబుతూ ఆయన ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది.

అబ్దుల్లా ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నవాబ్ కజం అలీ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. అబ్దుల్లా విద్యా ధృవీకరణ పత్రాల ప్రకారం జనవరి 1, 1993 న జన్మించారని, అతని జనన ధృవీకరణ పత్రం ప్రకారం అతని పుట్టిన తేదీ సెప్టెంబర్ 30, 1990గా ఉందని ఆరోపించారు.

లక్నో నగర్ నిగమ్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం ఆయనకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సహాయపడిందని ఆరోపించారు. 2015కి ముందు అబ్దుల్లాకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా జారీ కాలేదని పేర్కొంది.

అబ్దుల్లా తండ్రి ఆజం ఖాన్ కూడా రెండు జనన ధృవీకరణ పత్రాల కోసం వేర్వేరు క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎదుర్కొంటున్నారు. నగర్ పాలికా పరిషత్, రాంపూర్‌లో ఒక జనన ధృవీకరణ పత్రం జనవరి 28, 2012న జారీ చేయగా, మరొకటి ఏప్రిల్ 21, 2015న లక్నోలోని నగర్ నిగమ్‌ నుంచి జారీ అయిందని ఆకాష్ సక్సేనా దాఖలు చేసిన ఫిర్యాదుపై యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.