UGC PHD : యూజీ డిగ్రీ తర్వాత ఇక డైరక్ట్‌గా పీహెచ్డీ! నెట్ రాస్తే చాలు..
22 April 2024, 11:06 IST
UGC PHD rules : అండర్ గ్యాడ్జ్యుయేషన్ తర్వాత నేరుగా పీహెచ్డీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని యూజీసీ చీఫ్ తెలిపారు. నెట్ రాసి ఉత్తీర్ణులవ్వారని వివరించారు. పూర్తి వివరాలు..
యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్..
UGC PHD : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. ఇకపై నేరుగా నెట్‌కు హాజరై పీహెచ్డీ చేయవచ్చు! ఈ విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ తాజాగా వెల్లడించారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఉన్నా, లేకపోయినా పీహెచ్డీ చేయాలంటే.. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కనీసం 75 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్లు ఉండాలి.
UGC NET : ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)కు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇదీ చూడండి:- JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..
"నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అభ్యర్థులు ఇప్పుడు నేరుగా పీహెచ్డీ చేసి నెట్‌కు హాజరుకావచ్చు. అలాంటి అభ్యర్థులు ఏ విభాగంలో నాలుగేళ్ల బ్యాచులర్ డిగ్రీ పొందారో అన్న విషయంపై సంబంధం లేకుండా.. తమకు నచ్చిన సబ్జెక్టులో పీహెచ్డీ చేసేందుకు అనుమతిస్తారు,' అని కుమార్.. పీటీఐకి తెలిపారు.
"నాలుగు సంవత్సరాలు లేదా ఎనిమిది సెమిస్టర్ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించిన చోట పాయింట్ స్కేల్లో కనీసం 75 శాతం మార్కులు లేదా అందుకు సమాన గ్రేడ్ కలిగి ఉండాలి" అని యూజీసీ ఛైర్మన్ చెప్పారు.
UGC NET 2024 June session : యూజీసీ నిర్ణయం మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కులు లేదా అందుకు సమాన గ్రేడ్ సడలింపు ఇవ్వొచ్చని తెలిపారు.
యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమ య్యాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కోసం ఏప్రిల్ 20వ తేదీ నుంచి ugcnet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టెప్ 1:- ముందుగా విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2:- హోమ్ పేజీలోని 'న్యూ రిజిస్ట్రేషన్' బటన్ పై క్లిక్ చేయాలి.
UGC NET : స్టెప్ 3:- ఆ తరువాత, రిజిస్ట్రేషన్ క్రిడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 4:- కొత్త విండో ఓపెన్ అవుతుంది.
స్టెప్ 5:- అందులో కనిపించే అప్లికేషన్ ఫామ్ ను నింపండి.
స్టెప్ 6:- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
UGC NET 2024 june session application form స్టెప్ 7:- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
స్టెప్ 8:- సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.