Microsoft Windows boss: కొత్త మైక్రోసాఫ్ట్ విండోస్ బాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి-pavan davuluri iit madras graduate is new microsoft windows boss who is he ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Microsoft Windows Boss: కొత్త మైక్రోసాఫ్ట్ విండోస్ బాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి

Microsoft Windows boss: కొత్త మైక్రోసాఫ్ట్ విండోస్ బాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 12:37 PM IST

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ కు చీఫ్ గా ఇటీవల నియమితుడైన పవన్ దావులూరి ఐఐటీ గ్రాడ్యుయేట్. పవన్ ఐఐటీ మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మైక్రో సాఫ్ట్ లో పలు కీలక విభాగాల్లో విధులు నిర్వర్తించాడు. పవన్ దావులూరి గతంలో మైక్రోసాఫ్ట్ హార్డ్ వేర్ విభాగం చీఫ్ గా కూడా ఉన్నారు.

మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్ పవన్ దావులూరి
మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్ పవన్ దావులూరి (PTI)

Microsoft Windows new boss: అంతర్గతంగా విండోస్, సర్ఫేస్ బృందాలను మరోసారి విలీనం చేసింది. మైక్రోసాఫ్ట్ లో అభివృద్ధిని ట్రాక్ చేసే విండోస్ సెంట్రల్ ప్రకారం, ఈ రెండు విభాగాలకు నాయకత్వం వహించడానికి ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని నియమించింది. గతంలో, విండోస్ ను మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంతో విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ విండోస్ ను సర్ఫేస్ (surface)విభాగంతో కలిపి, ఈ రెండు విభాగాలకు పవన్ దావులూరి (Pavan Davuluri) ని చీఫ్ ని చేశారు. గతంలో మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ అండ్ డివైజెస్ ఒకే యూనిట్ గా రాజేష్ ఝా నేతృత్వంలో పని చేశాయి.

yearly horoscope entry point

పవన్ దావులూరి ఎవరు?

పవన్ దావులూరి (Pavan Davuluri) ఐఐటీ గ్రాడ్యుయేట్. ఐఐటీ మద్రాసు (IIT Madras)లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.పవన్ దావులూరి గతంలో మైక్రోసాఫ్ట్ హార్డ్ వేర్ యాక్టివిటీస్ ను పర్యవేక్షించారు. గత సెప్టెంబరులో మాజీ విండోస్, సర్ఫేస్ చీఫ్ పనోస్ పనాయ్ నిష్క్రమణ తర్వాత జరిగిన పునర్ వ్యవస్థీకరణలో ఆయన ఇప్పుడు విండోస్ (Microsoft Windows) ఇంజనీరింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. ఆ సమయంలో పనాస్ పనయ్ పాత్రను పవన్ దావులూరి, మిఖాయిల్ పరాఖిన్ మధ్య విభజించారు. మైక్రోసాఫ్ట్ లో వెబ్ అండ్ అడ్వర్టైజింగ్ సీఈఓగా ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు విండోస్ బాధ్యతలు మిఖాయిల్ చేపట్టారు. అతను బింగ్, ఎడ్జ్ మరియు కోపైలట్ వంటి ఉత్పత్తులను చూసుకున్నాడు.

విండోస్ ఆప్టిమైజేషన్

ఆర్మ్ ఆధారిత పరికరాల కోసం విండోస్ ను ఆప్టిమైజ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నం చేస్తోంది. ఆ కార్యకలాపాలను పవన్ పర్యవేక్షిస్తున్నారు. ‘‘ఈ రోజు, వ్యాపార అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మా మొట్టమొదటి #Surface ఏఐ పీసీలను ఆవిష్కరించాము. బిజినెస్ కోసం సర్ఫేస్ ప్రో 10, బిజినెస్ కోసం సర్ఫేస్ ల్యాప్టాప్ 6! #Copilot. మా వినియోగదారులకు ఈ పరికరాలు ఉపయోగపడ్తాయని ఆశిస్తున్నాను’’ అని Pavan Davuluri గతంలో ఎక్స్ లో పవన్ పోస్ట్ చేశారు.

మైక్రోసాఫ్ట్ లో ఏం మార్పు వస్తోంది?

మైక్రోసాఫ్ట్ ఇటీవల డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్ ను కొత్త ఏఐ విభాగానికి సీఈఓగా నియమించింది. దీంతో మిఖాయిల్ పరాఖిన్ జట్టును కొత్త ఏఐ విభాగంలోకి విలీనం చేశారు. మైక్రోసాఫ్ట్ త్వరలో కొత్త తరం ఏఐ ఫీచర్లు, ఆర్మ్ ఆధారిత సర్ఫేస్ హార్డ్వేర్ ను ఆవిష్కరించనుంది.

Whats_app_banner