తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ లిస్ట్..

UGC NET: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ లిస్ట్..

HT Telugu Desk HT Telugu

19 January 2024, 18:11 IST

  • UGC NET December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ లిస్ట్ విడుదలైంది. డౌన్ లోడ్ లింక్ లను ఇక్కడ చూడండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Agencies/file)

ప్రతీకాత్మక చిత్రం

UGC NET December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ జాబితాలను చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

డిసెంబర్ 6న..

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 (UGC NET December 2023) ఫలితాలను 2024 జనవరి 18న విడుదల చేశారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని జనవరి 3న విడుదల చేయగా, జనవరి 5న ఆబ్జెక్షన్స్ విండోను మూసివేశారు. ఆర్కియాలజీ సబ్జెక్టు ఆన్సర్ కీని జనవరి 8న విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2023 డిసెంబర్ 6 నుంచి 2023 డిసెంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లో 83 సబ్జెక్టుల్లో 9,45,918 మంది అభ్యర్థులకు యూజీసీ - నెట్ 2023 ని నిర్వహించింది.

ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 (UGC NET December 2023) ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ లిస్ట్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

  • యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించండి.
  • ఫైనల్ ఆన్సర్ కీ కోసం హోమ్ పేజీలో అందుబాటులో ఉన్నయూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫైనల్ ఆన్సర్ కీ పై క్లిక్ చేయండి.
  • కటాఫ్ లిస్ట్ కోసం హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కటాఫ్ లిస్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కీ లేదా కటాఫ్ లను చెక్ చేసుకోవచ్చు.
  • ఫైనల్ ఆన్సర్ కీ లేదా కటాఫ్ మార్క్స్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీలను భద్రపర్చుకోండి.
  • మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

తదుపరి వ్యాసం