UGC NET Result 2023: యూజీసీ నెట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి..
UGC NET Result 2023: యూజీసీ నెట్ 2023 ఫలితాలను (UGC NET Result 2023) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం వెల్లడించింది. యూజీసీ నెట్ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ugcnet.nta.ac.in లేదా, nta.ac.in వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు.
UGC NET Result 2023: యూజీసీ నెట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. యూజీసీ నెట్ 2023 డిసెంబర్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాలను విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్స్ అయిన ugcnet.nta.ac.in లేదా, nta.ac.in లో చెక్ చేసుకోవచ్చు.
9.45 లక్షల మంది..
యూజీసీ - నెట్ (UGC NET Result 2023) డిసెంబర్ ఎడిషన్ పరీక్షలను దేశవ్యాప్తంగా 292 నగరాల్లో 83 సబ్జెక్టుల్లో 2023 డిసెంబర్ 6 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. మొత్తం 9.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని జనవరి 3 వ తేదీన విడుదల చేశారు. ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి, ఈ ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను విద్యార్థులు తెలియజేయవచ్చని తెలిపారు. తాజాగా, జనవరి 17న ఫైనల్ ఫలితాలను విడుదల చేశారు.
ఎలా చెక్ చేయాలి?
యూజీసీ నెట్ 2023 డిసెంబర్ పరీక్షల ఫలితాలను విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా ugcnet.nta.ac.in లేదా, nta.ac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న ‘యూజీసీ నెట్ రిజల్ట్ 2023’ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఆ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ లేదా స్కోర్ కార్డ్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
- ఫలితాల పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
- ఈ ఫలితాలను పునః మూల్యాంకనం/పునఃపరిశీలన చేయడం సాధ్యం కాదు. దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు అనుమతించబడవు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in లేదా, nta.ac.in లను చూడవచ్చు.