PM Modi : ‘పాకిస్థాన్‌కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్!
13 May 2024, 14:38 IST
Lok Sabha elections : ‘పాకిస్థాన్‌కి నేను గాజులు తొడుగుతా..’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విపక్ష ఇండియా కూటమి నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
బిహార్ సభలో ప్రధాని మోదీ..
PM Modi on Pakistan : 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాల జోరును పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. బిహార్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో.. 'నేను పాకిస్థాన్‌కి గాజులు తొడుగుతాను,' అని ఆయన అన్నారు.
'పాకిస్థాన్‌కి నేను గాజులు తొడుగుతాను..'
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ని భారత్‌లో కలుపుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. 'పొరుగు దేశం గాజులు వేసుకుని కూర్చోలేదు. వాళ్ల దగ్గర ఆటమ్ బాంబ్ ఉంది. అది ఇండియాకు హాని చేయొచ్చు,' అన్నారు.
ఇక బిహార్‌ల జరిగిన బహిరంగ సభలో.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేశారు మోదీ. అదే సమయంలో పాకిస్థాన్ ఆర్థిక కష్టాలను లేవనెత్తారు.
PM Modi Lok Sabha elections : "పాకిస్థాన్ ఇంకా గాజులు వేసుకోకపోతే.. నేను గాజులు తొడుగుతాను. వాళ్ల దగ్గర విద్యుత్ లేదు. తిండి లేదు. వాళ్లకి ఇప్పుడు గాజుల కొరత కూడా ఉందని నాకు తెలిసింది," అని ముజాఫర్లో జరిగిన సభలో వ్యాఖ్యానించారు.
మరోవైపు.. 'పాకిస్థాన్ దగ్గర ఆటమ్ బాంబు ఉంది. మనం ఆ దేశాన్ని గౌరవించండి,' అని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీనిపైనా మోదీ కొన్ని రోజుల క్రితం స్పందించారు.
"దేశ ప్రజలను కాంగ్రెస్ నాశనం చేస్తోంది. లాంటి బలహీన మనస్థత్వం వల్లే సీమాంతర ఉగ్రవాదం గతంలో ఎక్కువగా ఉండేది. ఇక పాకిస్థాన్ విషయానికొస్తే.. తాము తయారు చేసిన బాంబులను అమ్మడానికి ఆ దేశం చాలా ప్రయత్నిస్తోంది. కానీ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో కొనేవారే లేరు!" అని మోదీ అన్నారు.
విపక్ష ఇండియా కూటమిపైనా విరుచుకుపడ్డారు మోదీ.
2024 Lok Sabha elections : "బిహార్ ప్రజల కన్నా.. ఆర్జేడీ- కాంగ్రెస్‌కి ఓటు బ్యాంకు సంక్షేమమే ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన కోసం ఆర్జేడీ ప్రయత్నిస్తోంది," అని మోదీ అన్నారు.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న లాలూ ప్రసాద్ యాదవ్ మాటలను తిప్పికొడుతూ.. 'దళితుల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి' అని మోదీ అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల 4వ దశ పోలింగ్ ప్రస్తుతం నడుస్తోంది. మొత్తం 7 దశలో పోలింగ్ తర్వాత.. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇండియా కూటమి కృషి చేస్తోంది.