తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pak Crew Slogan ‘India Zindabad’: ‘‘ఇండియా జిందాబాద్’’ అంటూ పాక్ జాతీయుల నినాదాలు; ఎందుకు? ఎక్కడ?

Pak crew slogan ‘India Zindabad’: ‘‘ఇండియా జిందాబాద్’’ అంటూ పాక్ జాతీయుల నినాదాలు; ఎందుకు? ఎక్కడ?

HT Telugu Desk HT Telugu

30 March 2024, 20:53 IST

  • ‘India Zindabad’: అరేబియా సముద్రంలో తమ నౌకను, తమ ప్రాణాలను సముద్రపు దొంగల నుంచి కాపాడిన భారతీయ నౌకాదళానికి పాకిస్తాన్ కు చెందిన సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 

    ఈ ఆపరేషన్ అనంతరం లొంగిపోయిన సముద్రపు దొంగలను భారత్ కు తరలిస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలను తమను కాపాడిన తరువాత ఇండియా జిందాబాద్ అని నినాదాలు చేస్తున్న పాక్ జాతీయులు
అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలను తమను కాపాడిన తరువాత ఇండియా జిందాబాద్ అని నినాదాలు చేస్తున్న పాక్ జాతీయులు (Yogesh Naik/Hindustan Times)

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలను తమను కాపాడిన తరువాత ఇండియా జిందాబాద్ అని నినాదాలు చేస్తున్న పాక్ జాతీయులు

అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఇరాన్ నౌక - అల్-కంబర్ ను భారతీయ నౌకాదళం (Indian Navy) రక్షించింది. ఆ నౌకను హైజాక్ చేసిన సాయుధులైన 9 మంది సముద్రపు దొంగలను (pirates) అదుపులోకి తీసుకుంది. ఆ రవాణా నౌకలో ఉన్న పాకిస్తాన్ కు చెందిన 23 మంది సిబ్బందిని ప్రాణాలతో కాపాడింది. దాంతో, ఆ నౌక లోని పాక్ సిబ్బంది ‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సాయుధ సముద్రపు దొంగల నుండి తమను రక్షించినందుకు భారత నావికాదళానికి ధన్యవాదాలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

సోమాలియా దొంగలు

ఇరాన్ కు చెందిన ఆ అల్-కంబర్ నౌకలో 23 మంది పాక్ సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోమాలియా సముద్రపు దొంగలు (Somalia pirates) తమను హైజాక్ చేశారని, వారందరినీ భారత నౌకాదళం (Indian Navy) రక్షించిందని ఒక వీడియోలో పేర్కొన్నారు. మొత్తం 23 మంది పాకిస్తాన్ సిబ్బంది 'ఇండియా జిందాబాద్' అని నినాదాలు చేస్తూ వీడియోలో కనిపించారు. ఆపరేషన్ తరువాత, లొంగిపోయిన తొమ్మిది మంది సముద్రపు దొంగలను అదనపు చట్టపరమైన చర్యల కోసం భారతదేశానికి తరలిస్తున్నామని, అక్కడ వారు మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ 2022 కింద అభియోగాలను ఎదుర్కొంటారని భారత నావికాదళం ప్రకటించింది.

12 గంటల ఆపరేషన్

ఇరాన్ నౌకను సొమాలియాకు చెందిన సముద్రపు దొంగల నుంచి కాపాడిన తరువాత అందులోని 23 మంది పాకిస్తానీ జాతీయులతో కూడిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత బోటును క్షుణ్నంగా పరిశీలించారు. అంతకుముందు, హైజాక్ కు గురైన ఇరాన్ నౌక లో నుంచి 23 మంది పాకిస్తానీ సిబ్బందిని భారత నౌకాదళం విజయవంతంగా రక్షించింది. 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇందులో ఐఎన్ఎస్ సుమేధ, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రిశూల్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

తదుపరి వ్యాసం