Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్.. దొరికిపోయి- చివరికి..
13 May 2024, 18:20 IST
Teenager forced marry twice : బిహార్‌కు చెందిన ఓ యువకుడు.. 19ఏళ్ల వయస్సులోనే తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది! వేరువేరు ఘటనల్లో.. ఇద్దరితో కలిసి ఉన్నప్పుడు దొరికిపోవడంతో బలవంతంగా పెళ్లి జరిపించారు.
గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు దొరికిపోయి.. చివరికి!
Bihar viral news : బిహార్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! ఓ యువకుడికి.. 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు వివాహం జరిగింది. వేరువేరు ఘటనల్లో తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ని కలిసేందుకు వెళ్లిన ఆ వ్యక్తి.. రెడ్-హ్యాండెడ్‌గా దొరికిపోవడం ఇందుకు కారణం.
ఇదీ జరిగింది..
బిహార్‌లోని జమౌ జిల్లాలో జరిగింది ఈ ఘటన. వినోద్ అనే 19ఏళ్ల యువకుడు.. అక్షర అనే గ్రామంలో నివాసముంటున్నాడు. గత నెల 22న.. అతను, నవ్కడిహ్ గ్రామంలోని ప్రీతీ కుమారీ ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది. అందుకే ఆమెను చూసేందుకు ప్రీతి ఇంటికి వెళ్లాడు.
అయితే.. ప్రీతీకి అప్పటికే పెళ్లి జరిగింది. ఒక బిడ్డ కూడా ఉంది. ఇవేవీ పట్టించుకోని ఆమె.. వినోద్‌ని ఇంటికి పిలిచింది. చివరికి గ్రామస్థులకు వారిద్దరు రెడ్-హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారిద్దరిని వెంటనే స్థానిక గుడికి తీసుకెళ్లి.. బలవంతంగా వివాహం జరిపించారు. సింగిల్‌గా వెళ్లిన వినోద్.. తన ఇంటికి భార్య ప్రీతీతో తిరిగి వచ్చాడు. ఇద్దరు కలిసి వైవాహిక బంధాన్ని కొనసాగించారు.
Bihar Jamui marriage news : ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు! ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఈ వినోద్.. తన గ్రామంలో డీజేగా పనిచేస్తూ ఉంటాడు. గిరిజ కుమారి అనే సింగర్‌తో చాలా కాలంగా ఇతను రిలేషన్లో ఉన్నాడు. ప్రీతీతో పెళ్లి తర్వాత కూడా.. గిరిజతో రిలేషన్‌ని కొనసాగించాడు. తన పెళ్లి వ్యవహారాన్ని గిరిజ దగ్గర దాచాడు. గిరిజ వ్యవహారాన్ని భార్య ప్రీతీకి కూడా చెప్పలేదు.
ఇదీ చూడండి:- Crime news : గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడిని బ్యాట్‌తో కొట్టి చంపేశారు!
మొదటి పెళ్లి అయిన 20 రోజుల్లోనే.. గిరిజ ఇంటింకి వెళ్లాడు వినోద్. గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండగా.. గ్రామస్థులు వారిద్దరిని రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గ్రామస్థులు.. వారిని ఆలయానికి తీసుకెళ్లి, బలవంతంగా పెళ్లి జరిపించారు.
ఇలా.. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ని పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాడు వినోద్.
Bihar viral news : ఇక రెండో పెళ్లి గురించి తెలుసుకున్న ప్రీతి.. షాక్‌కు గురైంది. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా.. రెండో భార్య మాత్రం.. 'నాకే ఇబ్బంది లేదు. ముగ్గురం కలిసి సంతోషంగా జీవిద్దాము,' అని అంటోంది.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వినోద్ పరిస్థితి చూసి కొందరు నవ్వుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం.. ఆ ఇద్దరిని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. 19ఏళ్లకే చాలా బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో వినోద్ పెళ్లి గురించి మీరేం అంటారు?
వాస్తవానికి.. గర్ల్‌ఫ్రెండ్‌తో బలవంతంగా పెళ్లి జరిపించడం చాలా సాధారణమైన విషయం. కానీ.. ఇద్దరితో పెళ్లి జరిపించడమే కొత్తగా ఉందని నెటిజన్లు అంటారు. మొదటి భార్య ఉన్నప్పుడు.. రెండో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎందుకు పెళ్లి జరిపించారు? ఇలా చేయడం.. సమస్యకు పరిష్కారమా? అని ప్రశ్నిస్తున్నారు.