Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్-pavitra jayaram kannada serial actress died of accident her husband chandrakanth emotional post gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu
May 13, 2024 04:24 PM IST

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి తర్వాత ఆమె భర్త చంద్రకాంత్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తిరిగి రావా అంటూ అతడు మనసును మెలిపెట్టేలా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.

టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్
టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ (Instagram)

Pavithra Jayaram: జీ తెలుగు సీరియల్ త్రినయనితో తెలుగు వారికి దగ్గరైన కన్నడ నటి పవిత్ర జయరాం మృతితో ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ షాక్‌కు గురయ్యాడు. ఓ కారు ప్రమాదంలో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. ఆదివారం (మే 12) ఈ ప్రమాదం జరగగా.. తర్వాత అతడు చేసిన ఓ ఎమోషనల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్ అవుతోంది.

పాపా తిరిగి రావా అంటూ..

త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన నటి పవిత్ర జయరాం. ఆదివారం (మే 12) బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఆ తర్వాత ఆమె భర్త, నటుడు చల్లా చంద్రుగా పాపులర్ అయిన చంద్రకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో తాను పవిత్రతో దిగిన చివరి ఫొటోను షేర్ చేయడం ప్రేక్షకులను మరింత కలిచి వేస్తోంది.

"పాపా నీతో దిగిన చివరి పిక్ రా.. నువ్వు నన్ను ఒంటరివాడివి చేశాన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా పవి ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా" అనే క్యాప్షన్ తో అతడు ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో భర్తతో కలిసి పవిత్ర ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ఈ సెల్ఫీ, దానికి చంద్రకాంత్ రాసిన క్యాప్షన్ మనసును కలిచి వేసేలా ఉంది.

ఈ పోస్ట్ చూసిన ఇన్‌స్టా యూజర్లు చాలా మంది ఆమె తమ నివాళి అర్పిస్తూ.. చంద్రకాంత్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కారు ప్రమాదంలో చంద్రు చేతికి, తలకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా అతడు మీడియాకు వివరించాడు. "ఇక్కడ షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నాం. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాం.

నేను, పవి, ఆమె అక్క కూతురు కారులో వస్తున్నాం. డ్రైవర్ ఉండటంతో నేను నిద్రలోకి జారుకున్నాను. అయితే అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసింది. దీంతో మా డ్రైవర్ కుడివైపుకు తిప్పాడు. దీంతో కారు డివైడర్ ను తాకి ముందుభాగంలో విండ్ షీల్డ్ ముక్కలైపోయింది" అని చంద్రకాంత్ వివరించాడు.

ఈ ప్రమాదంలో షాక్ కు గురైన పవిత్ర స్ట్రోక్ వల్ల చనిపోయిందని, గాయాల వల్ల కాదని కూడా చెప్పాడు. "ఈ ప్రమాదంలో నాకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదు. అది చూసి పవిత్ర షాక్ కు గురైంది. ఆమెకు స్ట్రోక్ వచ్చి స్పృహ కోల్పోయింది. మేము హాస్పిటల్ కు వచ్చే సరికి ఒంటి గంట అయింది. ఉదయం 4 గంటల సమయంలో నాకు స్పృహ రాగా ఆమె చనిపోయిందని తెలిసింది" అని చంద్రకాంత్ తెలిపాడు.

ఎవరీ పవిత్ర జయరాం?

కర్ణాకటలో మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్‍తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపటా, రాధారామన్, విద్యావినాయక సహా కన్నడలో పదికిపై పైగా సీరియళ్లు చేశారు.

నిన్నే పెళ్లాడతా అనే సీరియల్‍తో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. అయితే, ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్‍లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్‍తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్‍లో నెగెటివ్ రోల్ అయిన తిలోత్తమ పాత్రను పవిత్ర జయరాం పోషిస్తున్నారు.

IPL_Entry_Point