Pavitra Jayaram: విషాదం: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూత
Pavitra Jayaram died - Trinayani Serial: టీవీ సిరీయల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినయని సీరియల్‍తో తెలుగులో పాపులర్ అయిన ఈ సీనియర్ నటి మృతి చెందారు.
Pavitra Jayaram - Trinayani: టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినయని సీరియల్‍తో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు. త్రినయని సీరియల్‍లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర జయరాం నేడు (మే 12) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ప్రమాదం ఇలా!
పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణలోని మహబూబ్‍నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నేటి తెల్లవారుజామున కారు డివైడర్ తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం కన్నుమూశారు. కారులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
ఇంకెవరినీ ఊహించుకోలేం
పవిత్ర జయరాం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానెల్. ఆమె మృతి తోరని లోటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు” అని ట్వీట్ చేసింది.
కన్నడ నుంచి తెలుగుకు..
కర్ణాకటలో మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్‍తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపటా, రాధారామన్, విద్యావినాయక సహా కన్నడలో పదికిపై పైగా సీరియళ్లు చేశారు.
త్రినయనితో తెలుగు పాపులారిటీ
నిన్నే పెళ్లాడతా అనే సీరియల్‍తో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. అయితే, ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్‍లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్‍తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్‍లో నెగెటివ్ రోల్ అయిన తిలోత్తమ పాత్రను పవిత్ర జయరాం పోషిస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు. దీంతో తిలోత్తమగా పవిత్ర జయరాం బాగా ఫేమస్ అయ్యారు.
పవిత్ర జయరాం మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మరణంపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు. అద్భుత నటి ఈ లోకానికి దూరమయ్యారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు.
త్రినయని సీరియల్ గురించి..
త్రినయని సీరియల్ జీ తెలుగు ఛానెల్‍లో 2020 మార్చిలో ప్రారంభమైంది. సూపర్ నేచురల్ ఫిక్షనల్ సీరియల్‍గా ఉన్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్‍లను సాధిస్తోంది. బెంగాలీ త్రినయని ఆధారంగా తెలుగులో ఈ సీరియల్ కథను మేకర్స్ రూపొందించారు. త్రినయని తెలుగు సీరియల్‍లో ఆశిక పదుకొణె, చందు బీ గౌడ, పవిత్ర జయరాం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్య, విష్ణు ప్ర సురేశ్ చంద్ర, అనిల్ చౌదరి కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సీరియల్‍కు దినేశ్ పైనూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తిలోత్తమ పాత్ర పోషిస్తున్న పవిత్ర జయరాం మృతి చెందటంతో ఆ క్యారెక్టర్‌కు ఎవరిని తీసుకుంటారో చూడాలి.