Guppedantha Manasu Serial: దేవయానితో శైలేంద్ర గొడవ - రిషి తమ్ముడి కోసం వసు రిస్క్ - విలన్స్ డ్రామాకు చెక్
Guppedantha Manasu Serial: రాజీవ్ బతికే ఉన్నాడనే నిజం తల్లి దగ్గర దాచిపెడతాడు శైలేంద్ర. దేవయాని ఎంత అడిగిన నిజం చెప్పడు. దాంతో కొడుకుపై దేవయాని ఫైర్ అవుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu Serial: తాను ఇచ్చిన యాభై కోట్ల అప్పు తిరిగి చెల్లించకపోతే కాలేజీని తన సొంతం మను నోటీసులు ఇచ్చాడని దేవయాని, ఫణీంద్రలతో చెబుతాడు మహేంద్ర. ఆ మాట వినగానే మను మంచివాడు కాదని తాను ముందు నుంచే డౌట్ పడుతూనే ఉన్నానని దేవయాని అంటుంది. ప్లాన్ ప్రకారమే కాలేజీకి అప్పు ఉందని తెలుసుకొనే మను డ్రామా ఆడాడని, కాలేజీని తన సొంతం చేసుకోవడానికి అతడు వేసిన స్కెచ్ ఇదని మనుపై మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది.
మహేంద్ర బాధ...
చూస్తుంటే దత్తత కార్యక్రమం కూడా మను వేసిన ప్లాన్‌లానే ఉందని శైలేంద్ర అనుమానం వ్యక్తంచేస్తాడు. ఓ మోసగాడు నీ కొడుకు స్థానంలోకి రానందుకు హ్యాపీగా ఫీలవ్వు అంటూ మహేంద్రతో అంటుంది దేవయాని. తన కళ్లముందే మనును దేవయాని తిట్టడం మహేంద్ర సహించలేకపోతాడు. కానీ మన ప్లాన్ వర్కవుట్ కావాలంటే భరించకతప్పదని వసుధార అంటుంది.
శైలేంద్ర తడబాటు...
మనును నోటీసుల విషయంలోనే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్లి కలిశావా అని శైలేంద్రను నిలదీస్తాడు ఫణీంద్ర. రాజీవ్‌ను అప్పగిస్తే తనకు ఎండీ సీట్ ఇస్తానని మను ఇచ్చిన ఆఫర్‌ను దాచిపెట్టి...నోటీసులు వెనక్కి తీసుకునేది లేదని మను తనతో అన్నాడని అబద్ధం తండ్రి దగ్గర అబద్ధం ఆడుతాడు శైలేంద్ర.
మను నోటీసులు ఇచ్చి ఉండడని, మను మనకు చెడు తలపెడతాడంటే తాను నమ్మలేకపోతున్నాని ఫణీంద్ర అంటాడు. మను కాలేజీని జప్తు చేయకుండా ఉండాలంటే...ముందుగా అతడిని జైలు నుంచి విడిపించాలని...అప్పుడే మనకు ఓ దారి దొరుకుతుందని మహేంద్ర అంటాడు. అతడు చెప్పినట్లే చేయాలని ఫణీంద్ర అనుకుంటాడు.
వసుధార సలహా...
మను గురించి శైలేంద్ర, దేవయాని మాట్లాడుతోన్న మాటలు చూసి కోపంతో ఊగిపోతాడు మహేంద్ర. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఆడుతోన్న నాటకం బయటపడుతుందని, అప్పుడు మనుకు తీరని నష్టం జరుగుతుందని మహేంద్రతో అంటుంది వసుధార. ఆవేశం పనికిరాదని చెబుతుంది.
మనుపై తనకున్న ప్రేమ వల్ల వారు మాట్లాడే మాటల్ని భరించలేకపోతున్నానని మహేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు.
అనుపమ భయం...
మను కోసం వసుధార, మహేంద్ర చేస్తోన్న రిస్క్ చూసి అనుపమ భయపడుతుంది. శైలేంద్ర, రాజీవ్‌ల గుట్టు బయటపెట్టాలంటే మనం రిస్క్ తీసుకోకతప్పదని అనుపమకు సర్ధిచెబుతుంది వసుధార. మీ ప్లాన్ వాళ్లకు తెలిసిపోతే ఎలాంటి ఆపద తలపెడతాడో అని కంగారు పడుతున్నానని అంటుంది. చేయని తప్పుకు మనును జైలుకు పంపించారని, మీరు కూడా దూరమైతే తాను తట్టుకోలేనని అనుపమ ఎమోషనల్ అవుతుంది. భయపడితే ఏం చేయలేమని, ఈ ప్లాన్‌కు నువ్వు దూరంగా ఉండమని అనుపమతో అంటాడు మహేంద్ర. మనును మేమే కాపాడుకుంటాం అని కోపంగా అంటాడు.
శైలేంద్ర ఆలోచనలు...
మను ఇచ్చిన ఎండీ సీట్ ఆఫర్ గురించి శైలేంద్ర తెగ ఆలోచిస్తుంటాడు. కొడుకు దీర్ఘంగా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడని దేవయాని కనిపెడుతుంది. రాజీవ్ ఎక్కడున్నాడని అడుగుతుంది. పరధ్యానంలో రాజీవ్ బతికి ఉన్నాడని బయటపెట్టబోతాడు శైలేంద్ర. వెంటనే నిజాన్ని గ్రహించి మాట మార్చేస్తాడు. శైలేంద్ర కంగారును బట్టే అతడే అబద్ధం చెప్పాడని దేవయాని గ్రహిస్తుంది. నువ్వు నా దగ్గర రాజీవ్ గురించి ఏదో దాస్తున్నావని అంటుంది. ఎంత అడిగిన రాజీవ్ బతికి లేడని శైలేంద్ర తల్లి దగ్గర అబద్ధం ఆడుతాడు.
ధరణి ఎంట్రీ...
అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి...దేవయాని ముందు శైలేంద్రను ఇరికిస్తుంది. ఈ మధ్య శైలేంద్ర పూర్తిగా మారిపోయాడని, లవ్ సాంగ్స్ పెట్టుకొని తన ప్రేయసిని ఊహించుకుంటున్నాడని గొడవ పెద్దది చేస్తుంది. నా బాధ మీరైనా అర్థం చేసుకొండి అంటూదేవయానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి.
శైలేంద్ర గొడవ...
తనకు కుర్చీ పై మోజు తప్ప మరేం లేదని తల్లితో అంటాడు శైలేంద్ర. రాజీవ్ విషయంలో తల్లితో గొడవ పడతాడు శైలేంద్ర. తనను ప్రశ్నించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని దేవయానితో అంటాడు శైలేంద్ర. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావని, నాకు చెప్పకుండా అన్ని పనులు చేస్తున్నానవి కొడుకుపై దేవయాని ఫైర్ అవుతుంది. మను కాలేజీకి నోటీసులు పంపించిన విషయం తన దగ్గర దాచిపెట్టావని, రాజీవ్ విషయంలో ఏదో రహస్యం దాస్తున్నావని కోప్పడుతుంది. ఈ నిజాలు అన్ని తెలిసే రోజే నీకు తెలుస్తాయని తల్లికి సమాధానం చెప్పి ఆమె మాటలు పట్టించుకోకుండా శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శైలేంద్ర ట్రాప్...
ఎట్టి పరిస్థితుల్లో తమ ప్లాన్ బయటపడకుండా శైలేంద్రను ట్రాప్ చేయాలని వసుధార, మహేంద్ర ఫిక్సవుతారు. శైలేంద్రను నమ్మించి రాజీవ్ ఎక్కడున్నది బయటపెట్టాలని అనుకుంటారు. తనవైపు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని మహేంద్ర అంటాడు. శైలేంద్రను ఎరగా వాడుకొని రాజీవ్‌ను దెబ్బకొట్టాలని అనుకుంటారు.