Guppedantha Manasu Serial: వసు యాక్టింగ్‌కు శైలేంద్ర క్లీన్‌బోల్డ్ - రాజీవ్‌కు వెన్నుపోటు - మనుపై మహేంద్ర ద్వేషం
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న మనుతో వసుధార గొడవపడుతుంది. మంచివాళ్లుగా నటించి ఇంత మోసం చేస్తారని అనుకోలేదంటూ ఫైర్ అవుతుంది.
Guppedantha Manasu Serial: రాజీవ్ మర్డర్ కేసు నుంచి బయటపడేందుకు మను కొత్త ప్లాన్ వేస్తాడు. శైలేంద్రకు ఎండీ సీట్ ఆశచూపిస్తాడు. అందుకోసం రాజీవ్ ఎక్కడున్నాడో తనకు చెప్పాలని అంటాడు. మహేంద్ర, వసుధార కూడా తమ యాక్టింగ్‌తో మను ప్లాన్‌ను నిజమని శైలేంద్ర నమ్మేలా చేస్తారు. మనుపై తమకు ద్వేషం ఉన్నట్లుగా నటిస్తారు. మను మంచివాడు అనుకున్నామని, ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదని వసుధార కోపంగా అంటుంది.
నమ్మిన వాళ్ల మోసం…
మనం నమ్మినవాళ్లు అందరూ ఇలా మోసం చేస్తూనే ఉంటారు అంటూ శైలేంద్రవైపు చేతులు చూపించి అంటాడు మహేంద్ర. శైలేంద్ర కంగారు పడతాడు. నావైపు చేతులు చూపించారేంటి అని మహేంద్రను అడుగుతాడు. నిన్ను కాదు మనును అన్నానని మహేంద్ర మాటమార్చేస్తాడు.
మనం యాభై కోట్లు అప్పు తిరిగి ఇవ్వలేమనే...కాలేజీని సొంతం చేసుకోవడానికి మను కుట్రలు పన్నాడని, బోర్డు మీటింగ్ పెట్టి అతడి మోసాలను బయటపెడదామని మహేంద్ర ఆవేశంగా అంటాడు. బోర్డ్ మీటింగ్ అవసరం లేదని...మను పంపించిన నోటీసులను ముఖంపై కొట్టి, ఎందుకు ఇంత మోసం చేశావని అతడిని నిలదీస్తానని ఆవేశంగా వసుధార పోలీస్ స్టేషన్‌కు వెళుతుంది. వారిద్దరి డ్రామాను నిజమని శైలేంద్ర నమ్ముతాడు.
పోలీస్ స్టేషన్‌లో వసుధార...
పోలీస్ స్టేషన్‌లో ఉన్న మను దగ్గరకు వసుధార వస్తుంది. ఈ నోటీస్ ఏంటి? నాకు మీమీద చాలా గౌరవం ఉండేది. అది పోగోట్టుకోకండి అంటూ మనుపై ఫైర్ అవుతుంది వసుధార. మీ కాలేజీ నాకు యాభై కోట్లు అప్పు ఉంది. ఆ అప్పు ఇవ్వకపోతే కాలేజీని నేను జప్తు చేసుకుంటానని వసుధారకు కూల్‌గా బదులిస్తాడు మను.
అప్పు అడగటం తప్పేనా…
పైకి మంచిగా కనిపిస్తూ లోపల ఇంత దుర్మార్గం చేస్తారని, మొదటి నుంచి నాకు మీమీద డౌట్ ఉండేదని, నేను అనుకున్నదే నిజమైందని మనుతో కోపంగా మాట్లాడుతుంది వసుధార. కాలేజీకి యాభై కోట్లు ఇచ్చి మంచి చేస్తున్నట్లు నటించి ఇంత మోసం చేస్తారని అనుకోలేదని అంటుంది.
డబ్బు విషయంలో అందరూ స్వార్థంగానే ఆలోచిస్తారు. అంతేకానీ నేనేం చేయరాని తప్పు చేయలేదని వసుధారకు బదులిస్తాడు మను. నా యాభై కోట్లు నేను అడగటం కూడా తప్పేనా అని అంటాడు. నా యాభై కోట్లు ఎగ్గొట్టాలని చూసిన మీరే నా కంటే పెద్ద దుర్మార్గులు అంటూ వసుధారపై వసుధారపై రివర్స్‌గా ఫైర్ అవుతాడు మను.
మనుకు వసుధార వార్నింగ్...
కానిస్టేబుల్ ద్వారా వారిద్దరి మధ్య జరుగుతోన్న గొడవను శైలేంద్ర వింటుంటాడు. ఆ విషయం కనిపెట్టిన మను, వసుధార కావాలనే గొడవ పెద్దది చేస్తున్నట్లుగా నటిస్తారు. మీరు చేసిన పనికి మహేంద్ర చాలా కోపంగా, మిమ్మల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని మనుకు వార్నింగ్ ఇస్తుంది వసుధార. మీరు నన్ను ఏం చేయలేరని, నా డబ్బును ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు మను అంటాడు. కానీ వసుధారకు సాయం చేసేందుకే ఆ కానిస్టేబుల్ శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. వారి గొడవను అతడికి వినిపిస్తాడు.
కానిస్టేబుల్ మను మనిషే...
శైలేంద్ర తమ మాటలను నిజమని నమ్మాడని మను, వసుధార అనుకుంటారు. తమ డ్రామాను శైలేంద్ర ఎంత త్వరగా నిజమని నమ్మితే రాజీవ్ అంత త్వరగా బయటకు రాగలడని వసుధారతో అంటాడు మను. మీరు పదే పదే తన దగ్గరకు వస్తే మన ప్లాన్ మొత్తం శైలేంద్ర, రాజీవ్‌లకు తెలిసిపోయే ప్రమాదం ఉందని వసుధారకు సలహా ఇస్తాడు మను.
శైలేంద్ర పరాధ్యానం...
మను తనకు ఇచ్చిన ఎండీ సీట్ ఆఫర్ గురించే శైలేంద్ర తెగ ఆలోచిస్తుంటాడు. డిన్నర్ టైమ్‌లో కూడా ఆ ఆఫర్ గురించే పరధ్యానంగా ఆలోచిస్తూ అన్నాన్ని ప్లేట్‌లో కాకుండా కిందవడ్డించుకుంటాడు. అక్కడే కలుపుకొని తినబోతాడు. అతడికి ఏమైందోనని ఫణీంద్ర, దేవయాని కంగారు పడతారు. ధరణి చెప్పినట్లుగా.. మరో అమ్మాయి గురించే శైలేంద్ర ఆలోచిస్తున్నాడని కొడుకుకు ఫణీంద్ర క్లాస్ పీకుతాడు. వెధవ వేషాలు వేస్తే తాటతీస్తానని వార్నింగ్ ఇస్తాడు.
మను నోటీసులు...
ఫణీంద్ర దగ్గరకు వసుధార, మహేంద్ర కలిసి వస్తారు. కాలేజీకి తాను ఇచ్చిన యాభై కోట్లు తిరిగి ఇవ్వకపోతే కాలేజీని జప్తు చేసుకుంటానని మను నోటీసులు ఇచ్చిన సంగతిని బయటపెడతారు. మను అసలు రంగు ఇప్పుడు బయటపడిందంటూ అతడిపై దేవయాని కోపంగా ఎగిరిపడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.