Guppedantha Manasu Serial: తండ్రిని మోసం చేసిన రిషి తమ్ముడు - శైలేంద్రతో మను డీల్ - రాజీవ్ ఛాప్టర్ క్లోజ్
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో శైలేంద్ర ద్వారా రాజీవ్ ఆచూకీ కనిపెట్టడానికి మను కొత్త ప్లాన్ వేస్తాడు. అతడి ప్లాన్ ఫలిస్తుంది. మను ట్రాప్‌లో శైలేంద్ర పూర్తిగా పడిపోతాడు
వసుధారను తాను కిడ్నాప్ చేయాలనుకున్న ప్లాన్ ఫెయిలైన విషయం అప్పుడే శైలేంద్ర దగ్గరకు చేరిందని రాజీవ్ భయపడిపోతాడు. శైలేంద్ర ఎక్కడ క్లాస్ పీకుతాడో అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. రాజీవ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడు ఏదో తప్పు చేశాడని శైలేంద్ర కూడా కంగారు పడతాడు.
కాలేజీకి మను నోటీసులు...
తాను ఇచ్చిన యాభై కోట్ల అప్పును పదిహేను రోజుల్లో తీర్చాలని, లేదంటే డీబీఎస్‌టీ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటానని మను నోటీసులు పంపిస్తాడు. ఆ నోటీసులు చూసి శైలేంద్ర టెన్షన్ పడతాడు. మనుపై కోపంగా రగిలిపోతాడు. ఆ నోటీసుల ప్లాన్ గురించి తమకు తెలిసినా ఏం తెలియనట్లుగా శైలేంద్ర ముందు నాటకం ఆడుతారు మహేంద్ర, వసుధార.
ఇన్నాళ్లు మనును సొంత కొడుకులా ఫీలై నెత్తిన పెట్టుకున్నారు. కానీ మను అసలు రంగు నోటీసులతో బయటపడిందని, ఈ నోటీసులకు మీరే సమాధానం చెప్పాలని వసుధార, మహేంద్రపై ఎగిరిపడతాడు శైలేంద్ర. మనును దత్తత తీసుకుంటే ఇళ్లు కూడా రాయించుకునేవాడని, ముందు ముందు ఇంకా ఎన్ని దారుణాలకు తెగబడతాడో...అని మను పట్ల తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడతాడు.
మనును కలిసిన శైలేంద్ర...
యాభై కోట్లు అప్పు తీర్చినట్లు డ్రామా ఆడి...ఇప్పుడు ఏకంగా కాలేజీనే సొంతం చేసుకోవాలని మను వేసిన ప్లాన్ చూసి శైలేంద్ర కూడా బెదిరిపోతాడు. మను తనను మించిన కేటుగాడిలా ఉన్నాడని అనుకుంటాడు. మనును కలిసి ఈ విషయం ఏదో తానే తాడోపేడో తేల్చుకుంటానని శైలేంద్ర ఆవేశంగా పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. మనును కలుస్తాడు. అసలు కాలేజీకి అప్పు లేనప్పుడు నువ్వు ఎలా తీర్చావని, నోటీసులు ఎందుకు పంపించావని మనుపై ఫైర్ అవుతాడు.
కాలేజీకి అప్పు లేని విషయం నీకు, నాకు తప్ప మిగిలిన వాళ్లకు తెలియదు కదా...అందుకే నోటీసులు పంపించానని మను కూల్‌గా ఆన్సర్ ఇస్తాడు. నువ్వు అసలు అప్పు తీర్చలేదనే విషయం నేను అందరికి చెబుతానని శైలేంద్ర అంటాడు. ఆ అప్పు డ్రామా ఆడింది నువ్వేనని నేను అందరి ముందు బయటపెడతానని మను అంటాడు కాలేజీని సొంతం చేసుకోవడానికి అప్పు డ్రామాను క్రియేట్ చేసింది నువ్వేనని చెబుతానని మను అన్న మాటలతో శైలేంద్ర భయపడిపోతాడు.
రాజీవ్ బతికే ఉన్నాడు...
లేని అప్పు పేరుతో కాలేజీకి కొట్టేయడం కరెక్ట్ కాదని మనుపై కోప్పడతాడు శైలేంద్ర. నువ్వు నన్ను లేని పోని కేసులో ఎలా ఇరికించావో ఇదే అలాగేనని శైలేంద్రకు సమాధానమిస్తాడు మను. నువ్వు రాజీవ్‌ను చంపింది నిజం అని మనుతో వాదిస్తాడు శైలేంద్ర. ఆధారాలు కూడా ఉన్నాయని అంటాడు.
ఆధారాలది ఏముంది పుట్టించేవాళ్లు ఎన్నైనా పుట్టిస్తారు. రాజీవ్ బతికే ఉన్నాడని నాకు తెలుసునని శైలేంద్రతో అంటాడు మను. రాజీవ్ బతికే ఉన్నాడనే విషయం తనకు తెలియనట్లుగా మను ముందు డ్రామా ఆడుతాడు శైలేంద్ర. అతడి నాటకాన్ని మను నమ్మడు. మీరు తోడుదొంగలు అని నాకు తెలుసు. నువ్వు, రాజీవ్ కలిసే నన్ను కేసులో ఇరికించారని కూడా తెలుసునని అంటాడు..
శైలేంద్రకు మను ఆఫర్...
నువ్వు నన్ను కేసులో నుంచి బయటపడేస్తే నీకు ఎండీ సీట్ ఇస్తానని శైలేంద్రకు ఆఫర్ ఇస్తాడు రాజీవ్. కాలేజీని నీకు అప్పగిస్తానని అంటాడు. మను మాటలను శైలేంద్ర నమ్మడు. ఎండీ పదవి నీ కల, జీవితలక్ష్యం అని నాకు తెలుసు, ఆ పదవి కోసమే ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డావు.
అలాంటి ఎండీ పదవిని దేవుడు నా రూపంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఆలోచించుకోమని శైలేంద్రతో అంటాడు మను. ఇదే మన ఇద్దరి మధ్య ఉన్న డీల్. రాజీవ్ బతికే ఉన్నాడని నాకు తెలుసు. వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు. రాజీవ్‌ను పట్టిస్తే...నేను జైలు నుంచి బయటకివస్తాను. కేసు నుంచి బయటపడిన మను క్షణం నీకు కాలేజీ అప్పగిస్తానని శైలేంద్రకు ఆఫర్ ఇస్తాడు మను.
మను ట్రాప్‌లో శైలేంద్ర...
నువ్వు కాలేజీ నాకు ఇస్తే..వసుధార చూస్తూ ఊరుకోదని శైలేంద్ర అంటాడు. నేను ఇచ్చిన యాభై కోట్ల అప్పు వసుధార తీర్చలేదు. ఆ అప్పు పేరుతో కాలేజీని నేను సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత నీకు అప్పగిస్తానని శైలేంద్ర తన మాటలు నమ్మేలా చేస్తాడు మను. అతడి ట్రాప్‌లో శైలేంద్ర పడతాడు.
శైలేంద్రపై మహేంద్ర ఫైర్...
మనును కలిసిన శైలేంద్ర తిరిగి కాలేజీకి వస్తాడు. మనును కలిసి నోటీసులు రిటర్న్ తీసుకోమని అడిగావా అని శైలేంద్రను అడుగుతాడు మహేంద్ర. తాను ఎంత అడిగినా నోటీసులు వెనక్కి తీసుకునేది లేదని మను పట్టుపడుతున్నాడని మహేంద్రకు సమాధానమిస్తాడు శైలేంద్ర. అన్నింటికి తెగించే మను నోటీసులు పంపించాడని చెబుతాడు. పోటుగాడిలా ఎందుకు స్టేషన్‌కు వెళ్లావని శైలేంద్రపై కావాలనే కోపాన్ని చూపిస్తాడు మహేంద్ర.
మనును నమ్మి మోసపోయా...
మను ఎంత స్వార్థపరుడో తనకు ఇప్పుడు అర్థమైందని, తనను నమ్మి మోసపోయానని మహేంద్ర కావాలనే మనుపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. మనును తాను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నానని, టైమ్ చూసుకొని వెన్నుపోటు పొడిచాడని, మీ వల్లే ఇదంతా జరిగిందని మహేంద్రతో వాదిస్తుంది వసుధార.
మనతో మంచిగా ఉన్నట్లు నటించి మోసం చేశాడని, ఇప్పుడు యాభై కోట్లు ఎలా ఇవ్వగమని బాధపడుతున్నట్లుగా వసుధార నటిస్తుంది. వసుధార, మహేంద్ర డ్రామాలు నిజమని నమ్ముతాడు శైలేంద్ర.