Rajiv Swagruha Flats : బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో ఇవ్వనున్నారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాట్లు చేశాయి.
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఈ నెల 27 నుంచి 29 తేదీ మధ్య లాటరీ తీసి ఇళ్లను కేటాయించనున్నారు. దరఖాస్తులు ఎక్కువ చేసినా కూడా.. ఆధార్ నంబరు ఆధారంగా ఒక్కరికి ఒక్క ఫ్లాట్ మాత్రమే ఇస్తారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 3716 ఫ్లాట్ల కోసం 39,082 దరఖాస్తులు అందాయని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ముందు నిర్ణయించిన ధర ప్రకారమే లాటరీలో ఫ్లాట్లను కేటాయిస్తారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ ప్రక్రియ జరుగుతుంది. 27న పోచారం ఫ్లాట్లు, 28న బండ్లగూడ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లు, 29న బండ్లగూడలోని 3బీహెచ్‌కే డీలక్స్ ఫ్లాట్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఐపీఆర్ తెలంగాణ, ఏస్ మీడియా ఫేస్‌బుక్ లైవ్, ట్యూబ్ లైవ్‌లో అందుబాటులో కూడా ఉండనుంది. కేటాయించిన ఫ్లాట్లు, దరఖాస్తుదారుల వివరాలు హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్‌లను నిర్ణీత ధరకు విక్రయించేందుకు ప్రభుత్వం మే 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు 12.05.2022 నుండి 14.06.2022 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించారు. 3716 ఫ్లాట్‌ల కోసం మొత్తం 39082 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బండ్లగూడలో 2246 ఫ్లాట్లకు 33161 దరఖాస్తులు, పోచారంలో 1470 ఫ్లాట్లకు 5921 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 3 BHKలో 345 ఫ్లాట్ల కోసం 16,679 దరఖాస్తులు వచ్చాయి. 29న లాటరీ తీస్తారు.
ఒక్క ఆధార్ ఒక ఫ్లాట్‌కు మాత్రమే అర్హత కలిగి ఉంటుంది. నిర్దిష్ట ఆధార్ నంబర్‌కు కేటాయించినట్లయితే.. వేరే ఆధార్ మీద ఇంకో ప్లాట్ వస్తే.. అదనపు ఫ్లాట్ రద్దు చేస్తారు. ఒక ఫ్లాట్‌కు మాత్రమే అర్హత పొందుతారు. కేటాయించిన తర్వాత, కేటాయించిన వ్యక్తి 7 రోజులలోపు 10శాతం, 60 రోజులలోపు 80శాతం, అలాట్‌మెంట్ లెటర్ జారీ చేసిన తేదీ నుండి 90 రోజులలోపు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. బ్యాంకు రుణాలు అందుబాటులోకి ఉన్నాయి.
టాపిక్