Crime news : గల్లీ క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. యువకుడిని బ్యాట్​తో కొట్టి చంపేశారు!-youth beaten to death after quarrel during cricket match in northwest delhi cops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : గల్లీ క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. యువకుడిని బ్యాట్​తో కొట్టి చంపేశారు!

Crime news : గల్లీ క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. యువకుడిని బ్యాట్​తో కొట్టి చంపేశారు!

Sharath Chitturi HT Telugu
May 12, 2024 03:30 PM IST

Delhi crime news : క్రికెట్​ మ్యాచ్​లో జరిగిన గొడవ.. ఓ యువకుడి ప్రాణాలు తీసింది! కోపంలో కొందరు.. ఆ యువకుడిని బ్యాట్లతో కొట్టి చంపేశారు. దిల్లీలో జరిగింది ఈ ఘటన.

దారుణం.. క్రికెట్​ బ్యాట్​తో యువకుడిని కొట్టి చంపేశారు!
దారుణం.. క్రికెట్​ బ్యాట్​తో యువకుడిని కొట్టి చంపేశారు!

Youth dead in cricket match fight : దేశ రాజధాని దిల్లీలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్​ మ్యాచ్​లో జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటికి వెళ్లలేదు! అతడిని.. బ్యాట్లతో కొట్టి చంపేశారు.

ఇదీ జరిగింది..

వాయువ్య దిల్లీలోని భరత్​ నగర్​ అనే ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. కొందరు యువకులు.. క్రికెట్​ ఆడటానికి వెళ్లారు. ఓపెన్​ గ్రౌండ్​లో క్రికెట్​ ఆడుతుండగా.. ఏదో విషయంపై గొడవ మొదలైంది. చివరికి.. ఆ గొడవ చాలా పెద్దగా అయ్యింది. గొడవ జరుగుతోందని, వచ్చి ఆపాలని.. మ్యాచ్​ ఆడుతున్న వారిలో ఒకరు.. తన సోదరుడైన విశాల్​ కుమార్​ని పిలిచాడు. 21ఏళ్ల విశాల్​ కుమార్​.. గ్రౌండ్​కి వెళ్లాడు.

Delhi crime news : గొడవను నియంత్రించేందుకు విశాల్​ చాలా కష్టపడ్డాడు. కానీ అక్కడున్న వారు.. తమ కోపాన్ని 21ఏళ్ల విశాల్​పై చూపించారు. బ్యాట్లతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. రక్తం కారుతున్నా.. పట్టించుకోకుండా కొడుతూనే ఉన్నారు. చివరికి.. విశాల్​ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.

స్థానికులు విశాల్​ని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.

అదే సమయంలో.. క్రికెట్​ గ్రౌండ్​లో ఓ వ్యక్తి మరణించాడన్న వార్త పోలీసులకు తెలిసింది. పోలీసుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి.. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుంది.

ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, గుర్తు తెలియని వ్యక్తులపై మర్డర్​ కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Delhi Bharat Nagar murder : క్రికెట్​ మ్యాచ్​లో గొడవతో యువకుడిని బ్యాట్లతో కొట్టి చంపేశారన్న వార్త.. స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వార్త విన్న వారందరు షాక్​కు గురవుతున్నారు. క్షణికావేశంలో విచక్షణారహితంగా ప్రవర్తించి, నేరాలకు పాల్పడుతున్న వారిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:- Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

తల్లి, భార్య, పిల్లలను చంపి..

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తల్లి, భార్య, పిల్లలను చంపి.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. ఉత్తర్​ ప్రదేశ్​లో శనివారం కలకలం సృష్టించింది.

ఉత్తర్​ ప్రదేశ్​ లక్నోకు సుమారు 90 కి.మీల దూరంలోని పహల్​పూర్​ గ్రామంలో శనివారం జరిగింది ఈ ఘటన. అనురాగ్​ సింగ్​ వయస్సు 42ఏళ్లు. అతను చాలా కాలం క్రితమే.. మందు, డ్రగ్స్​కి బానిసయ్యాడు. అతడిని డీ-అడిక్షన్​ కేంద్రానికి పంపించాలని కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయంపైనే అనురాగ్​కి, కుటుంబసభ్యులకు మధ్య చాలాసార్లు గొడవలు అయ్యాయి. శనివారం ఉదయం కూడా.. ఇదే విషయంపై గొడవైంది. మందు, డ్రగ్స్​ని వదిలేయాలని తల్లి, భార్య చెప్పారు. కానీ అప్పటికే మత్తులో ఉన్న అనురాగ్​కు తీవ్రంగా కోపం వచ్చింది! విచక్షణారహితంగా ప్రవర్తించి, అందరిని చంపేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం