Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!
UP crime news latest : మద్యం, డ్రగ్స్‌కి బానిసైన ఓ వ్యక్తి.. తన తల్లి, భార్యను కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. తన ముగ్గురు పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి హత్య చేశాడు. చివరికి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Man kills wife and kids in Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మందుకు, డ్రగ్స్‌కి బానిసైన ఓ వ్యక్తి.. తన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ లక్నోకు సుమారు 90 కి.మీల దూరంలోని పహల్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ వయస్సు 42ఏళ్లు. అతను చాలా కాలం క్రితమే.. మందు, డ్రగ్స్‌కి బానిసయ్యాడు. అతడిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించాలని కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయంపైనే అనురాగ్‌కి, కుటుంబసభ్యులకు మధ్య చాలాసార్లు గొడవలు అయ్యాయి.
UP crime news : శనివారం ఉదయం కూడా.. ఇదే విషయంపై గొడవైంది. మందు, డ్రగ్స్‌ని వదిలేయాలని తల్లి, భార్య చెప్పారు. కానీ అప్పటికే మత్తులో ఉన్న అనురాగ్‌కు తీవ్రంగా కోపం వచ్చింది! విచక్షణారహితంగా ప్రవర్తించి, అందరిని చంపేశాడు.
ముందు.. తన తల్లి, 65ఏళ్ల సావిత్రిని కాల్చి చంపాడు అనురాగ్. ఆ తర్వాత.. తన భార్య, 40ఏళ్ల ప్రియాంకపై దాడి చేశాడు. గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ గది అంతా.. రక్తపు మడుగుతో నిండిపోయింది. ఆ తర్వాత.. ముగ్గురు పిల్లలు.. అశ్విణి (12), ఆర్నా (9), అద్వైక్ (6)లను ఇంటి మీదకు తీసుకెళ్లి.. పై నుంచి కిందపడేశాడు. ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు
ఆ తర్వాత.. అనురాగ్ కూడా, ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు!
UP man kill mother : అనురాగ్ చేసిన పనిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. ఇంటిలో, ఇంటి బయట పడి ఉన్న 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన అద్వైక్ని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. అతను కూడా ప్రాణాలు కోల్పోయాడని.. లక్నో ట్రామా సెంటర్ వైద్యులు వెల్లడించారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
"ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫోరెన్సీక్ టీమ్ కూడా పని చేస్తోంది. అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము. మత్తుకు బానిసైన అనురాగ్.. కుటుంబాన్ని చంపేశాడని తెలుస్తోంది. పూర్తి దర్యాప్తు ముగిసిన తర్వాత, మరిన్ని వివరాలను వెల్లడిస్తాము," అని సీనియర్ పోలీసు అధికారి చక్రేశ్ మిశ్రా తెలిపారు.
Crime news latest : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయం విన్న వారందరు షాక్‌కు గురవుతున్నారు. సంబంధిత ఇంటి ముందు.. భారీగా ప్రజలు గుమిగూడారు.
సంబంధిత కథనం