crime news : రూ. 2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. ఉద్యోగిని కొట్టి చంపేశాడు!-ghaziabad 22 yr old beaten to death by employer on suspicion of stealing 2000 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : రూ. 2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. ఉద్యోగిని కొట్టి చంపేశాడు!

crime news : రూ. 2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. ఉద్యోగిని కొట్టి చంపేశాడు!

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 07:20 AM IST

Ghaziabad crime news : పర్సు నుంచి రూ.2వేలు దొంగిలించాడనే అనుమానంతో 22 ఏళ్ల కార్ సర్వీస్ సెంటర్ మెకానిక్​ని యజమాని కొట్టి చంపేశాడు. ఈ ఘటన ఘజియాబాద్​లో చోటు చేసుకుంది.

యజమాని దాడిలో మరణించిన పంకజ్​ కుమార్​..
యజమాని దాడిలో మరణించిన పంకజ్​ కుమార్​..

Man kills employee in Ghaziabad : ఘజియాబాద్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. తన పర్సులో నుంచి రూ. 2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. తన దగ్గర ఉద్యోగ చేస్తున్న ఓ వ్యక్తిని కొట్టి చంపేశాడు యజమాని! ఈ ఘటన స్థానికంగా కలకల సృష్టించింది.

ఇదీ జరిగింది..

ఘజియాబాద్​లోని తిలా షబాజ్​బుర్​​లో గురువారం మధ్యాహ్నం జరిగింది ఈ షాకింగ్​ ఘటన. 22ఏళ్ల పంకజ్​ కుమార్​కు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. కాగా.. స్థానికంగా ఉన్న ఓ కారు సర్వీస్​ సెంటర్​లో మెకానిక్​గా అతను పనిచేస్తున్నాడు.

నిందితుడి పేరు.. అమిత్ కుమార్ మావి. అతని వయస్సు 32ఏళ్లు. కాగా.. మావి పర్సు తన కారులో ఉందని, అందులో సుమారు రూ.2,000 మాయమైనట్లు గుర్తించాడు. అది పంకజ్​ కుమారే దొంగిలించాడని అనుమానించాడు.

Man kills employee over 2000 : డబ్బు మాయమవ్వడం వెనుక పంకజ్ ఉన్నాడని అనుమానించి.. కోపంతో అతడిని తాడుతో కట్టేసి కొట్టడం మొదలుపెట్టాడు మావి. కర్రతో తీవ్రంగా కొట్టడంతో పంకజ్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. కోపం చల్లారిన తర్వాత.. తాను చేసిన గాయాలు తీవ్రంగా ఉన్నాయని గ్రహించిన అమిత్.. గాయపడిన పంకజ్​ను దిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం బాధితుడు మరణించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పంకజ్​ తండ్రి విజయ్ కుమార్.. లోని బోర్డర్ పోలీసులను ఆశ్రయించారు. యజమానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు.

"సర్వీస్ స్టేషన్​లో నా కుమారుడిని అమిత్ తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నా కుమారుడు మరణించాడు. ఇది విన్న తరువాత అమిత్ పారిపోయాడు," అని లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్​లో నమోదైన ఎఫ్ఐఆర్​లో కుమార్ పేర్కొన్నాడు.

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితుడు అమిత్ మావిపై హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ వర్మ తెలిపారు.

Crime news latest : మరోవైపు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కృషిచేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే మావిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని కూడా శవపరీక్షకు పంపించామని, తీవ్ర గాయాల కారణంగానే మృతుడు మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు.

రూ.2వేలు దొంగిలించాడన్న అనుమానంతో.. ఉద్యోగిని ఓ వ్యక్తి కొట్టి చంపాడన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది విన్నవారందరు షాక్​కు గురవుతున్నారు. క్షణికావేశంలో నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా.. నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం