తెలుగు న్యూస్  /  National International  /  Shraddha Walkar Murder Case Aaftab Looked Confident Remorseless During Questioning Says Maharashtra Police

Shraddha Walkar murder: అది లవ్ జిహాదా? మిత్రుల అనుమానాలు.. పశ్చాత్తాపం కనిపించలేదంటున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu

16 November 2022, 9:31 IST

    • Shraddha Walkar murder: శ్రద్ధా వల్కర్ కేసు లవ్ జిహాద్ అని ఆమె మిత్రులు అనుమానిస్తున్నారు. మతం మారాలని ఒత్తిడి చేసి ఉండవచ్చని ఆరోపణలు చేస్తున్నారు..
Aaftab Poonawala and Shraddha Walkar: శ్రద్ధా హత్య లవ్ జిహాద్ గా మిత్రుల అనుమానాలు
Aaftab Poonawala and Shraddha Walkar: శ్రద్ధా హత్య లవ్ జిహాద్ గా మిత్రుల అనుమానాలు (HT_PRINT)

Aaftab Poonawala and Shraddha Walkar: శ్రద్ధా హత్య లవ్ జిహాద్ గా మిత్రుల అనుమానాలు

ముంబై, నవంబర్ 16: కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వల్కర్‌ను హత్య కేసులో ఆమె లివ్-ఇన్-పార్ట్‌నర్ ఆఫ్తాబ్ పూనావాలాను విచారిస్తున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

ఢిల్లీలో ఆమె దారుణంగా హత్యకు గురైనప్పుడు నిందితుడిని మహారాష్ట్రలోని మాణిక్‌పూర్ పోలీసులు ఇంతకుముందు విచారణకు పిలిచారు. ఆ సమయంలో అతని ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నమ్మకంగా కనిపించాడని పోలీసులు తెలిపారు. శ్రద్దా వల్కర్ కుటుంబ సభ్యులు ఆమె జాడ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాల్ఘర్‌లోని వసాయి పట్టణంలోని మానిక్‌పూర్ పోలీసులు ఆఫ్తాబ్ పూనావాలాను రెండుసార్లు విచారించారు.

గత నెలలో ఒకసారి, నవంబర్ 3 న మరోసారి విచారణ కోసం పిలిచారు. రెండు సందర్భాల్లోనూ వల్కర్ తనతో కలిసి ఉండడం లేదని పోలీసులకు చెప్పినట్టు  అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంపత్రావ్ పాటిల్ తెలిపారు. 

వల్కర్‌ను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో పడేసినందుకు పూనావాలా (28)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

‘అక్టోబరులో మొదటిసారిగా పూనావాలాను విచారణకు పిలిచాం. నవంబర్ 3న మళ్లీ పిలిచి రెండు పేజీల వాంగ్మూలం నమోదు చేసుకున్నాం. రెండు సార్లు చాలా నమ్మకంగా కనిపించాడు. అతడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు..’ అని పాటిల్ చెప్పాడు.

గత నెలలో తాము ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌ వెళ్లి అక్కడ పూనావాలాను ప్రశ్నించామని ఆ అధికారి తెలిపారు. కానీ ఆ సమయంలో కూడా అతను అదే విషయాన్ని చెబుతూనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

‘మతం మారాలని బలవంతం చేసి ఉండొచ్చు..’

వల్కర్ సన్నిహిత మిత్రుడు రజత్ శుక్లా మాట్లాడుతూ అఫ్తాబ్ పూనావాలా ఆమెను మతం మారాలని బలవంతం చేసి ఉండవచ్చునని అన్నారు.

‘అతను (అఫ్తాబ్) మామూలు మనిషి కాదు.. లవ్ జిహాద్, టెర్రరిజం, లేదా ఈ మొత్తం కేసులో ఏదో ఒక మిషన్ ఉండొచ్చు. కేసుపై లోతైన విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలి.. ఆఫ్తాబ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. వాస్తవమేమిటనేది ఇప్పుడే బయటకు రావాలి..’ అని శుక్లా అన్నారు.

‘ఆఫ్తాబ్ ప్రేమికుడిలా కనిపించలేదు. ఒకవేళ ప్రేమికుడైతే తాను ప్రేమించిన వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో ఉంచి పారవేసినంత దారుణమైన నేరం చేయలేడు..’ అని శుక్లా అన్నారు.

ఆఫ్తాబ్ శ్రద్ధా వల్కర్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తమకు 2019లో తెలిసిందని శుక్లా చెప్పారు. ‘అయితే వారిద్దరూ 2018 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దానిని రహస్యంగా ఉంచారు. మా స్నేహితులు కొందరు ఆఫ్తాబ్ పూనావాలాను కూడా కలిశారు..’ అని వివరించారు.