తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sarabjit Singh Wife Death : పాక్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి దుర్మరణం

Sarabjit Singh wife death : పాక్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి దుర్మరణం

Sharath Chitturi HT Telugu

13 September 2022, 6:38 IST

    • Sarabjit Singh wife death : అమృత్​సర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుఖ్​ప్రీత్​ కౌర్​ మరణించారు. ఆమె.. పాకిస్థాన్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ భార్య.
సరబ్జిత్​ సింగ్​ సతీమణి కన్నుమూత
సరబ్జిత్​ సింగ్​ సతీమణి కన్నుమూత (HT_PRINT)

సరబ్జిత్​ సింగ్​ సతీమణి కన్నుమూత

Sarabjit Singh wife death : పాకిస్థాన్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి సుఖ్​ప్రీత్​ కౌర్​​.. సోమవారం తుదిశ్వాస విడిచారు. బైక్​ వెనక కూర్చుని వెళుతున్న ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

అమృత్​సర్​లోని ఫతేహ్​పూర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. సుఖ్​ప్రీత్​ కౌర్​ అంత్యక్రియలు మంగళవారం ఆమె స్వస్థలం భిఖివిండ్​ ప్రాంతంలో జరగనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Sukhpreet Kaur : సరబ్జిత్​ సింగ్​- సుఖ్​ప్రీత్​ కౌర్​కు పూనం, స్వపన్​దీప్​ కౌర్​ అనే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.

సరబ్జిత్​ సింగ్​ను పాకిస్థాన్​ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన ఆయన సోదరి దల్బీర్​ కౌర్​.. గుండె పోటు కారణంగా ఈ ఏడాది జూన్​లో మరణించారు.

పాకిస్థాన్​ జైలులో..

పాకిస్థాన్​లో ఉగ్రవాదానికి, గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ.. 1991లో అక్కడి కోర్టు సరబ్జిత్​ సింగ్​కు ఉరిశిక్ష విధించింది. 2008లో ఆ ఉరిశిక్షను నిరవధికంగా వాయిదా వేసింది.

Sarabjit Singh Pakistan jail : కాగా.. 2013లో తోటి ఖైదీలు చేసిన దాడిలో 49ఏళ్ల సరబ్జిత్​ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు.

సరబ్జిత్​ సింగ్​ మరణం అనంతరం ఆయన మృతదేహాన్ని లాహోర్​ జైలు నుంచి అమృత్​సర్​కి తీసుకొచ్చారు. అక్కడే ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.