తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan To Bring Law For Farmers: రైతుల కోసం ప్రత్యేక చట్టం తెస్తున్న రాష్ట్రం

Rajasthan to bring law for farmers: రైతుల కోసం ప్రత్యేక చట్టం తెస్తున్న రాష్ట్రం

HT Telugu Desk HT Telugu

15 February 2023, 22:05 IST

  • Rajasthan to bring law for farmers: అందిన చోటల్లా అప్పులు తెచ్చి, ఆరుగాలం కష్టపడి సాగు చేసి, సరైన దిగుబడి రాక, ఒకవేళ మంచి దిగుబడి వచ్చినా ఆ పంటకు సరైన ధర రాక, అప్పుల పాలవుతున్న రైతన్నల  కోసం రాజస్తాన్ (Rajasthan) ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan to bring law for farmers: అందిన చోటల్లా అప్పులు తెచ్చి, ఆరుగాలం కష్టపడి సాగు చేసి, సరైన దిగుబడి రాక, ఒకవేళ మంచి దిగుబడి వచ్చినా ఆ పంటకు సరైన ధర రాక, అప్పుల పాలవుతున్న రైతన్నల కోసం రాజస్తాన్ (Rajasthan) ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Rajasthan to bring law for farmers: హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్

సాగుకు చేసిన అప్పులు తీరక, అవమానాల పాలై, నమ్ముకున్న భూమిని కోల్పోయి, అవమానంతో ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు దేశవ్యాప్తంగా ఉన్నారు. తమ రాష్ట్రంలోని అలాంటి రైతుల కోసం రాజస్తాన్ (Rajasthan) ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. నెల రోజుల్లోగా సంబంధిత బిల్లును సిద్ధం చేయాలని రాజస్తాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) అధికారులను ఆదేశించారు. ప్రత్యేక చట్టంతో పాటు, ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. అప్పుల పాలైన రైతులను ఆదుకోవడంతో పాటు, వారి భూమికి వేలం వేయకుండా నిరోధించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Rajasthan to bring law for farmers: ప్రత్యేక కమిషన్

ప్రతిపాదిత రాజస్తాన్ ఫార్మర్స్ డెట్ రిలీఫ్ బిల్ (Rajasthan Farmers’ Debt Relief Bill) లో రైతుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఆ కమిషన్ కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. రుణ బాధల నుంచి రైతులకు శాశ్వతంగా పరిష్కారం లభించేలా బిల్లును రూపొందించనున్నారు. అలాగే, రుణం చెల్లించలేని రైతుల భూమి, ఇతర ఆస్తులను వేలం వేసే విధానాన్ని కూడా నిలిపి వేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ సమస్య ప్రధానంగా సామాజికంగా అణగారిన వర్గాలకు చెందిన రైతులనే ఎక్కువగా వేధిస్తోందని రాజస్తాన్ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రేయ గుహ వెల్లడించారు.

Rajasthan to bring law for farmers: వడ్డీలేని పంట రుణాలు

2023 -24 నుంచి రైతులకు వడ్డీలేని పంట రుణాలు అందజేస్తామని ఆమె వివరించారు. అందుకు గానే రూ. 22 వేల కోట్ల అంచనా రూపొందించామన్నారు. చేతివృత్తుల వంటి చిన్నతరహా ఉపాధి మార్గాల్లో ఉన్నవారి కోసం రూ. 3 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 7282 Primary Agricultural Credit Societies (PACS)లను కంప్యూటరైజ్ చేయనున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయం కోసం వేరుగా ప్రత్యేక బడ్జెట్ ను ప్రతిపాదించారు.