తెలుగు న్యూస్  /  National International  /  Presidential Polls Result: Droupadi Murmu Leads Against Yashwant Sinha After End Of First Round Of Counting

Presidential polls result: ద్రౌప‌ది ముర్ము ముందంజ‌

HT Telugu Desk HT Telugu

21 July 2022, 16:38 IST

  • Presidential polls result: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఊహించిన‌ట్లే అధికార ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము భారీ మార్జిన్‌తో ముందంజ‌లో ఉన్నారు. తొలి రౌండ్ ఎంపీల ఓట్ల‌ను లెక్కించారు.

ద్రౌప‌ది ముర్ము
ద్రౌప‌ది ముర్ము (AP)

ద్రౌప‌ది ముర్ము

Presidential polls result: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముకు 44 పార్టీలు మ‌ద్ద‌తివ్వ‌గా, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు 34 పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా గ‌ణిస్తే.. ద్రౌప‌ది ముర్ము ఎన్నిక లాంఛ‌న‌మే.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Presidential polls result: భారీ మెజారిటీ

ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 748 ఎంపీ ఓట్లు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉన్నాయి. వాటిలో 540 ఓట్లు ద్రౌప‌ది ముర్ము సాధించారు. 208 ఓట్ల‌ను య‌శ్వంత్ సిన్హాకు వ‌చ్చాయి. 15 ఓట్లు చెల్ల‌లేదు. ఎల‌క్టోర‌ల్ ఓట్ల ప్ర‌కారం చూస్తే..మొత్తం 5.2 ల‌క్ష‌ల ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్లలో ద్రౌప‌ది ముర్ము 3.8 ల‌క్ష‌ల ఓట్లు, య‌శ్వంత్ సిన్హా 1.4 ల‌క్ష‌ల ఓట్లు సాధించారు.

Presidential polls result: ఘ‌న విజ‌య‌మే..

ఎంపీల ఓట్ల లెక్కింపు అనంత‌రం, రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యేల ఓట్ల‌ను లెక్కిస్తారు. ఇందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అయితే, ముర్ముకు ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన పార్టీల బ‌ల‌బ‌లాల‌ను ప‌రిశీలిస్తే.. అధికార ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం సాధిస్తార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, ఊహించిన మెజారిటీ క‌న్నా ఎక్కువే ఆమె సాధిస్తుంద‌ని తెలుస్తోంది. విప‌క్ష అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మద్ధ‌తిచ్చిన పార్టీల స‌భ్యుల్లో కొంద‌రు గిరిజ‌న మ‌హిళ అయిన ద్రౌప‌ది ముర్ముకు ఓటేసిన‌ట్లు స‌మాచారం.