Teachers rape student : స్కూల్ టాయిలెట్లోకి దూరి.. 6వ తరగతి విద్యార్థినిపై టీచర్లు రేప్!
11 November 2023, 7:20 IST
Teachers rape student : 6వ తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన బాలిక.. స్కూల్ టాయిలెట్లో రేప్‌నకు గురైన ఘటన ఒడిశాలో కలకలం సృష్టించింది. ఇద్దరు టీచర్లే ఆమెను రేప్ చేశారు!
స్టూడెంట్‌పై టీచర్లు రేప్.. స్కూల్ టాయిలెట్లోకి ప్రవేశించి!
Teachers rape student in Odisha : ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్‌కు వెళ్లిన ఓ 6వ తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఒడిశా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఇదీ జరిగింది..
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో మంగళవారం జరిగింది ఈ ఘటన. 6వ తరగతి చదువుకుంటున్న 11ఏళ్ల గిరిజన బాలిక.. స్కూల్లోని టాయిలెట్‌కు వెళ్లింది. అదే సమయంలో.. ఓ టీచర్, హెడ్ మాస్టర్ అక్కడికి వెళ్లారు. బాత్రూమ్లోకి ప్రవేశించి, బాలికపై బలవంతం చేశారు. ఆమెను రేప్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని ఆరోజు.. బాలిక ఎవరికి చెప్పలేదు.
కాగా.. మరుసటి రోజు, బాలికకు కడుపులో నొప్పి మొదలైంది. నొప్పిగా ఉందని చెప్పడంతో బాలికను ఆమె కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. బాలిక అప్పుడు, తనకు జరిగినది వివరించింది.
Odisha crime new : గిరిజన బాలిక కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. నిందితులను విచారించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పోక్సో సహా ఇతర కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు.
మరోవైపు మెరుగైన వైద్యం కోసం బాలికను.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోందని సమాచారం.
Student raped in School toilet : ఈ ఘటనను.. ఒడిశా మానవ హక్కుల కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. స్కూల్ టాయిలెట్లోకి ప్రవేశించి, బాలికపై టీచర్లు అత్యాచారం చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టి, నివేదికను అందించాలని సీడీఎంఓ (చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్)కు ఆదేశాలిచ్చింది.
రాజకీయ దుమారం..
ఒడిశాలో బాలిక అత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి.
"రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మైనర్లపై జరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆడబిడ్డలకు ఈ రాష్ట్రంలో భద్రత లేదు. నబరంగ్‌పూర్ స్కూల్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై మేము నిరసనలు చేపడతాము," అని బీజేపీ వెల్లడించింది.
6th class student raped : "రాష్ట్రంలో 65 ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. వారిలో 42 మంది బీజేడీకి చెందినవారే!" అని బీజేపీ చెప్పుకొచ్చింది.
ఈ విషయంపై కాంగ్రెస్ కూడా తీవ్రంగానే స్పందించింది. రాష్ట్రంలోని పార్టీ నేతలందరు ఏకమై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బాలికకు న్యాయం జరగడం కోసం ఆందోళనలు చేపడతామని స్పష్టం చేసింది.