Hyderabad Crime : పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్!
Hyderabad Crime : పనిమనిషిపై అత్యాచారం ఘటనలో హైదరాబాద్ లో ఓ ప్రముఖ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
Hyderabad Crime : హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ కు ఛైర్మన్ గా పనిచేసిన మురళీ ముకుంద్ దారుణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో పనిచేస్తో్న్న ఓ మహిళపై మురళీ ముకుంద్ అత్యాచారం చేశాడు. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ మిధులానగర్ లోని తన ఇంట్లో పనిమనిషిపై ముకుంద్ అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసిన అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ విద్యాసంస్థ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్ పనిమనిషిపై అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం ఆయనను నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపర్చారు. జులై 16న మురళీ ముకుంద్ తన ఇంట్లో పనిచేస్తోన్న పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తనపై అత్యాచారం చేసిన ఘటనను మురళీ ముకుంద్ కొడుకు బాధితురాలు చెబితే, అతను ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా యువతి స్నానం చేస్తున్న సమయంలో ఫొటోలు , వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేశారు.
14 రోజుల రిమాండ్
సిమ్ కార్డు దొంగతనం చేసినట్లు జులై 20న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనపై తప్పుడు కేసు పెట్టారని బాధిత యువతి వాపోయింది. దీంతో ఆమె మురళీ ముకుంద్ ఇంట్లో పనిమానేసింది. తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిన కూతురిని ఆమె తల్లి నిలదీసింది. దీంతో తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో మురళీ ముకుంద్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు...కేసు నమోదు చేశారు. మంగళవారం మురళీ ముకుంద్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. మురళీ ముకుంద్ కుమారుడు ఆకాష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేసి నాంపల్లి జడ్జి ముందు హాజరుపర్చారు. అతడిని కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ ను విధించారు. కోర్టు ఆదేశాలతో మురళీ ముకుంద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.