Sex racket : ఆ వ్యభిచార గృహానికి ఓనర్ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్‌తో..!
Sex racket busted in Navi Mumbai : వ్యభిచార గృహం నడుపుతున్న ఓ 17ఏళ్ల బాలికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం పోలీసులు ఓ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
Mumbai Sex racket : ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. కాగా.. ఆ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నది 17ఏళ్ల బాలిక!
ఇదీ జరిగింది..
అంధేరీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న 17ఏళ్ల బాలిక.. గత కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతోంది. కానీ ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదు. తమ బిడ్డ.. చదువుకు ఫీజు కట్టుకునేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తోందని వారు అనుకునే వారు.
కానీ ఆ బాలిక.. నలుగురు మోడల్స్‌తో నవీ ముంబైలో వ్యభిచారం చేసేది. డేటింగ్ యాప్స్‌లో కస్టమర్లకు గాలం వేసేది. తొలుత వారితో మామూలుగా చాట్ చేసేది. తన మీద నమ్మకం పెరిగిన తర్వాత.. అసలు విషయానికి వచ్చేది. అలా.. వారికి సెక్స్ సర్వీస్ ఇచ్చేది. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ. 50వేలు తీసుకునేది. ఇలా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఆ మోడల్స్‌కు ఇచ్చి, మిగిలినవి దాచుకునేది.
Mumbai crime news : కాగా.. ఈ సెక్స్ రాకెట్ విషయంపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ కేసును ఛేదించాలని నిర్ణయించుకున్న పోలీసులు.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. చివరికి బాలికను పట్టుకున్నారు.
"బాలిక దగ్గర నలుగురు మోడల్స్ ఉన్నారు. వారి వయస్సు 20, 21, 24, 30. గతంలో వారు సీరియల్స్‌లో చిన్నచిన్న పాత్రలు చేసేవారు. మేము డేటింగ్ యాప్‌లో బాలికతో చాట్ చేశాము. పోలీసులము అని తెలియకుండా.. ఒక కస్టమర్‌గా సంప్రదించాము. కొన్ని రోజులకు ఆమె అసలు విషయానికి వచ్చింది. మోడల్స్‌కు సంబంధించిన న్యూడ్ ఫొటోలు పంపి, రేట్లు చెప్పింది. నలుగురు పురుషుల కోసం సర్వీస్ కావాలని అడిగాము. ఒక్కొక్కరికి రూ. 50వేలు చెప్పింది. కానీ రూ. 30వేలు అడిగాము. అలా.. రూ. 1.20లక్షలకు ఫిక్స్ చేసింది. ఇదంతా.. ఆమెకు మా మీద అనుమానం రాకుండా ఉండేందుకే చేశాము. మంగళవారం నాడు.. సత్రా ప్లాజ్‌కు సమీపంలోని ఓ హోటల్‌కు రావాలని పిలిచాము. అక్కడ ఆ నలుగురు మోడల్స్‌ని ఆమె తీసుకొచ్చింది. అందరిని పట్టుకున్నాము," అని పోలీసులు వెల్లడించారు.
Sex racket busted in Navi Mumbai : నలుగురు మోడల్స్‌ని రీహాబిలేషన్ సెంటర్‌కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. నిందితురాలు మైనర్ కావడంతో ఆమెను జువెనైల్ హోమ్‌కు తరలించినట్టు స్పష్టం చేశారు. ఆమెను విచారించగా.. "జీవితాన్ని సాగించేందుకు చేయక తప్పలేదు," అని ఆమె చెప్పినట్టు పోలీసులు వివరించారు.
ఈ ఘటనపై సెక్షన్ 370 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సంబంధిత కథనం