Telangana: ఒడిశా టు ఓల్డ్‌సిటీ గంజాయి స్మగ్లింగ్.. 430 కిలోలు సీజ్‌-telangana police bust interstate drug syndicate of dry ganja ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana: ఒడిశా టు ఓల్డ్‌సిటీ గంజాయి స్మగ్లింగ్.. 430 కిలోలు సీజ్‌

Telangana: ఒడిశా టు ఓల్డ్‌సిటీ గంజాయి స్మగ్లింగ్.. 430 కిలోలు సీజ్‌

Oct 20, 2023 01:33 PM IST Muvva Krishnama Naidu
Oct 20, 2023 01:33 PM IST

  • గంజాయిని తరలిస్తున్న ముఠాని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ పాత బస్తీకి స్మగ్లింగ్‌ చేస్తున్న ఈ ముఠా.. ఐరన్‌ బాక్స్‌లో గంజాయి దాచి తీసుకొస్తుంది. పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు, ఈ ముఠాను పట్టేశారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మాట్లాడుతూ, బీదర్‌కు చెందిన బహుల్య లీలావతి అలియాస్‌ గంగరాజు, గోపాల్‌ అలియాస్‌ మూల్‌ చంద్‌, సంతోష్‌, మోహన్‌ రాథోడ్‌ ఒక గ్యాంగుగా ఏర్పడ్డారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేయాలని, ఇందుకు ఒక గూడ్స్‌ క్యారియర్‌ను తీసుకొని అందులోని ఐరన్‌ బాక్స్‌ల్లో గంజాయి ప్యాక్‌ చేసి రవాణా చేస్తే ఎవరికీ పట్టుబడమని నిర్ణయించుకున్నారు. పట్టుబడిన ఈ ముఠా నుంచి 430 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 1.1 కోట్లు ఉంటుందని సీపీ చెప్పారు.

More