Kota rape case : కోటాలో నీట్ విద్యార్థినిపై అత్యాచారం.. టిఫిన్ డెలివరీ బాయ్ అరెస్ట్!
14 October 2023, 6:25 IST
Kota rape case : నీట్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కోటాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో.. టిఫిన్ బాయ్‌తో పాటు హాస్టల్ యజమానిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
కోటాలో విద్యార్థినిపై అత్యాచారం..
Kota rape case : విద్యార్థుల ఆత్మహత్యలతో ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజస్థాన్ కోటాలో మరో కలకలం! స్థానికంగా ఓ హాస్టల్లో ఉంటూ.. నీట్కి ప్రిపేర్ అవుతున్న ఓ బాలికపై అనేకమార్లు అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి.. ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది..
బిహార్‌కు చెందిన ఓ 15ఏళ్ల బాలిక.. నీట్ కోచింగ్ కోసం రాజస్థాన్ కోటాకు వెళ్లింది. అక్కడి ఓ హాస్టల్లో.. తన సోదరితో కలిసి జీవిస్తోంది. కాగా.. గత ఫిబ్రవరిలో.. ఆమెను ఓ టిఫిన్ బాయ్ కలిశాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి మాటలు కలిపాడు. అలా.. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొద్ది రోజులు మాట్లాడుకున్నారు.
Rajasthan rape case : కాగా.. ఫిబ్రవరిలో బాలిక రూమ్‌కి వెళ్లాడు ఆ టిఫిన్ బాయ్. ఆమె చేత మద్యం తాగించాడు. బాలిక.. అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని.. నీట్‌కు ప్రిపేర్ అవుతున్న బాలికను బెదిరించడం మొదలుపెట్టాడు. బాధితురాలు.. ఇప్పటివరకు 6,7సార్లు రేప్‌నకు గురైంది.
ఈ విషయాన్ని.. బాలిక, హాస్టల్ యజమాని దృష్టికి తీసుకెళ్లింది. సాయం చేయాలని కోరింది. కానీ.. హాస్టల యజమానీ, ఆమెను మందలించాడు. జరిగిందేదో జరిగిందని అంటూ.. టిఫిన్ బాయ్‌ని పెళ్లిచేసేసుకోమని సలహా ఇచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తిట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. ఎవరికైనా చెబితే కుటుంబం పరువు పోతుందని అనేవాడు.
NEET aspirant raped in Kota : టిఫిన్ బాయ్ చర్యలను తట్టుకోలేకపోయిన బాలిక.. చివరికి.. ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. టిఫిన్ బాయ్‌తో పాటు హాస్టల్ యజమానిపైనా ఫిర్యాదు చేసింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టిఫిన్ బాయ్‌తో పాటు హాస్టల్ యజమానిని కూడా అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.
కూతురిని చంపిన తండ్రి..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా మారాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందన్న కారణంతో.. సొంత బిడ్డను కిరాతకంగా చంపేశాడు ఓ తండ్రి. ఈ ఘటన కర్ణాటకలో కలకలం సృష్టించింది.
కర్ణాటక దేవనహల్లికి సమీపంలోని బిదులూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంజునాథ్ అనే వ్యక్తి, తన కుటుంబంతో అక్కడ చాలా సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు బిడ్డలు. పెద్ద కూతురి పేరు కవన. ఆమె వయస్సు 20ఏళ్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.