NEET student suicide : 'నీట్'లో ఫెయిల్ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. మరుసటి రోజే తండ్రి కూడా!
NEET student suicide : నీట్లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. ఈ ఘటనతో మానసిక క్షోభకు గురైన అతని తండ్రి.. మరుసటి రోజే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
NEET student suicide : తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్లో రెండుసార్లు విఫలమయ్యాడన్న బాధతో ఓ 19ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. అతని తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు!
నీట్ పాస్ అవ్వలేదని..!
తమిళనాడు రాజధాని చెన్నైలోని క్రోమపేట్లో ఈ ఘటన జరిగింది. 19ఏళ్ల ఎస్ జగదీశ్వరన్.. నీట్ పరీక్ష కోసం చాలా కష్టపడ్డాడు. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. ఆ బాధతో.. ఈనెల 12న, తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Tamil Nadu NEET suicide : జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని తండ్రి సెల్వశేఖర్ ఇంట్లో లేడు. ఇంటికి వెళ్లేసరికి, కుమారుడి మృతదేహాన్ని చూసి విలపించాడు. మానసిక క్షోభకు గురయ్యాడు. మరుసటి రోజు అతను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
"నేను సింగిల్ పేరెంట్‌ని. జగదీశ్వరన్ రెండుసార్లు నీట్లో విఫలమైన తర్వాత.. అతడిని కోచింగ్ సెంటర్లో చేర్పించాను. వాస్తవానికి వారం రోజులుగా అతను సరిగ్గా తినడం లేదు. నాకు వర్క్ ఉండి బయటకు వెళ్లాను. మధ్యాహ్నం ఫోన్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి.. నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. నీట్ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడతానని తన మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అలా జరగలేదు. నా బిడ్డ బతికి లేడు. ఇలాంటి దురదృష్ట ఘటన ఎవరికి ఎదురవ్వకూడదు," అని చెప్పి, ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు సెల్వశేఖర్.
సెల్వశేఖర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జగదీశ్వరన్ మృతదేహాన్ని కూడా ఇదే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందన..
NEET suicides in Tamil Nadu : నీట్ పరీక్ష నేపథ్యంలో తండ్రి, కుమారుల మరణంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నీట్‌ను రద్దు చేయగలమని, విద్యార్థులు ఆత్మహత్య వంటి ఆలోచనలను మానుకోవాలని సూచించారు.
"జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి షాక్‌కు గురయ్యాను. అతని తండ్రికి ఎలా సంఘీభావం చెప్పాలని ఆలోచిస్తుండగా.. సెల్వశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. వారి కుటుంబానికి నేను ఎలా సంఘీభావం చెప్పాలో అర్థం కావడం లేదు," అని స్టాలిన్ అన్నారు.
"మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. నీట్‌ను తొలగిస్తామని మాకు నమ్మకం ఉంది. మీ లక్ష్యాలకు అడ్డంకిగా ఉన్న నీట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది," అని స్టాలిన్ తెలిపారు.
Tamil Nadu latest news : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ను రాష్ట్రంలో రద్దు చేసేందుకు అసెంబ్లీలో ఓ బిల్లును ఆమోదించింది ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం. కానీ దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదం తెలపలేదు. కొన్ని మార్పుల తర్వాత ఆ బిల్లులను తిరిగి గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం. ఆ బిల్లును గవర్నర్.. రాష్ట్రపతికి పంపించారు.
అయితే.. నీట్లో మంచి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిశారు. ఈ సందర్భంగా.. బిల్లుకు తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం తెలపనని ఆయన వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం