AP Buddhist monk found dead: బుద్ధ గయలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బౌద్ధ సన్యాసి ఆత్మహత్య!
AP Buddhist monk found dead: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బౌద్ధ సన్యాసి బిహార్ లోని బుద్ధ గయలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతడి మృతదేహం గురువారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
AP Buddhist monk: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బౌద్ధ సన్యాసి బిహార్ లోని బుద్ధ గయలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతడి మృతదేహం ప్రఖ్యాత మహాబోధి ఆలయం సమీపంలో గురువారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
నెల్లూరు వాస్తవ్యుడు..
ఆ బౌద్ధ సన్యాసి అతడి వద్ద ఉన్న ఆధార్ కార్డు, వాలెట్, పాస్ పోర్ట్, లైసెన్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి చెందిన హౌవర్డ్ డేవిడ్ సంజిబ్ గా గుర్తించారు. అతడి వయస్సు 44 ఏళ్లు. నెల్లూరు లోని జాకిర్ హుస్సేన్ నగర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఆ బౌద్ధ సన్యాసి ఆత్మ హత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత, మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని తెలిపారు. చాలా రోజులుగా ఆ వ్యక్తి బౌద్ధ సన్యాసి వస్త్ర ధారణలో బుద్ధ గయలో తిరుగుతున్నాడని స్థానికులు తెలిపారు. గత మూడు రోజులుగా స్థానికంగా ఉన్న బర్మా బౌద్ధ మఠంలో ఉంటున్నాడు. అతడి గదిలో పోలీసులకు కొన్ని పుస్తకాలు మినహా ఏమీ లభించలేదు.
కాళి ఆలయ ప్రాంగణంలో..
బుద్ధ గయలోని నిరంజన నది సమీపంలో కాళి ఆలయ ప్రాంగణంలో చెట్టుకు నైలాన్ తాడుతో వేలాడుతూ అతడి మృతదేహం గురువారం ఉదయం మార్నింగ్ వాక్ కు వచ్చిన స్థానికులకు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, స్థానికంగా ఉన్నఅనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అతడి వద్ద ఉన్న ఒక బ్యాగ్ లో ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వైర్, కీ, చిన్న కత్తి వంటివి పోలీసులకు లభించాయి.