తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Unnao Rape Victim : ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి డబ్బులు దోచుకుని.. ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబం!

Unnao rape victim : ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి డబ్బులు దోచుకుని.. ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబం!

Sharath Chitturi HT Telugu

22 October 2023, 14:40 IST

google News
  • Unnao rape victim : ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు.. సొంత కుటుంబంపై కేసు పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వారు దోచుకుంటున్నారని, సొంత ఇంట్లో నుంచి తనని బయటకు పంపించేశారని ఆ 8నెలల గర్భవతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి డబ్బులు దోచుకుని..!
ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి డబ్బులు దోచుకుని..!

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి డబ్బులు దోచుకుని..!

Unnao rape victim : 2017 ఉన్నావ్​ అత్యాచార కేసు బాధితురాలిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది! తాజాగా.. ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన ఇంటిని, డబ్బులను, ఆ మహిళ కుటుంబసభ్యులు దోచుకున్నట్టు, ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించేసినట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

2017లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్​ సెన్గార్​.. తనని కిడ్నాప్​ చేసి, అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చేసిన ఆరోపణలు సర్వత్రా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆమె ఒక మైనర్​. దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో సెన్గార్​ని పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. రెండేళ్ల పాటు సాగిన కేసు విచారణలో సెన్గార్​ దోషిగా తేలారు. ఫలితంగా 2019 డిసెంబర్​ నుంచి ఆయన జైలులోనే ఉంటున్నాడు. ఆయన అసెంబ్లీ సభ్యత్వం కూడా పోయింది.

కాగా.. ఈ ఘటన జరిగిన తర్వాత అనేక ఎన్​జీవోలు బాధితురాలికి అండగా నిలిచాయి. ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక సాయం చేసింది. ఇక ఇప్పుడు.. ఆ డబ్బులను ఇవ్వకుండా కుటుంబసభ్యులు తనను బయటకు పంపించేశారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Unnao rape case victim latest news : "నాకు పెళ్లైంది. నేను 8నెలల గర్భవతిని. ఇంట్లో వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నాను. ప్రభుత్వం, ఎన్​జీఓలు ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని నేను అడిగితే.. నన్ను బెదిరించారు. కేసు విచారణకు రూ.7 కోట్లు ఖర్చు అయ్యిందని, నేనే ఇంకా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని నా మామ చెబుతున్నాడు. ఓ హత్యచార కేసులో ప్రస్తుతం అతను తీహార్​ జైలులో 10ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన ఆదేశాలతోనే.. నా తల్లి, సోదరి నాకు శత్రువులుగా మారారు. ప్రభుత్వం నాకు ఇచ్చిన ఇంటి నుంచి నన్ను బయటకు గెంటేశారు. నా భర్తపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. బెదిరింపులు తట్టుకోలేకపోతున్నాను," అని ఉన్నావ్​ అత్యాచార కేసు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

Unnao rape case : తాజా ఘటనకు సంబధించి.. మహిళ తల్లి, సోదరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు, నిజానిజాలను తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు.

తదుపరి వ్యాసం