UP crime news : యూపీలో బాలిక కిడ్నాప్​.. నెలన్నర పాటు రేప్​!-up crime news minor kidnapped and raped for one and half month ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Crime News : యూపీలో బాలిక కిడ్నాప్​.. నెలన్నర పాటు రేప్​!

UP crime news : యూపీలో బాలిక కిడ్నాప్​.. నెలన్నర పాటు రేప్​!

Sharath Chitturi HT Telugu
Aug 29, 2023 09:17 AM IST

UP crime news : బాలికను కిడ్నాప్​ చేసిన వ్యక్తి.. నెలన్నరపాటు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో చోటుచేసుకుంది. చివరికి.. పోలీసులు బాధితురాలిని రక్షించారు.

యూపీలో బాలిక కిడ్నాప్​.. నెలన్నర పాటు రేప్​!
యూపీలో బాలిక కిడ్నాప్​.. నెలన్నర పాటు రేప్​!

UP crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల మైనర్​ను కిడ్నాప్​ చేసిన ఓ వ్యక్తి.. ఆమెను నెలన్నర పాటు రేప్​ చేశాడు!

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ బాలియా ప్రాంతంలోని కోట్వాలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు జులై 9న అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా, ఫలితం దక్కకపోవడంతో.. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

Minor raped in Uttar Pradesh : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్​ ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి.. ఆమె డియోరియా ప్రాంతంలో ఉందని తెలుసుకున్నారు. ఈ నెల 26న ఆమెను రక్షించారు. ఈ క్రమంలో, బాధితురాలు.. తనకి జరిగింది పోలీసులకు వివరించింది.

"బిహార్​కు చెందిన రాహుల్​ కుమార్​ సింగ్​ (19).. నన్ను కిడ్నాప్​ చేశాడు. డియోరియాలో పెట్టాడు. నెలన్నర పాటు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు," అని బాలిక స్టేట్​మెంట్​ ఇచ్చింది.

UP minor raped for a month : బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే అతడిని అరెస్ట్​ చేశారు.

రేప్​ కేసులో నిందితుడికి 15ఏళ్ల జైలు శిక్ష..

మిస్డ్​ కాల్​ ద్వారా కలిసిన ఓ మహిళను రేప్​ చేసిన వ్యక్తికి.. 15ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది ఝార్ఖండ్​ కోర్టు. 2021లో ఈ ఘటన జరిగింది.

2021లో మహిళ.. పొరపాటను నిందితుడికి కాల్​ చేసింది. మిస్డ్​ కాల్​ అని చెప్పి, పెట్టేసినప్పటికీ.. ఆ వ్యక్తి, ఆమె నెంబర్​ సేవ్​ చేసుకున్నాడు. తరచూ కాల్​ చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్​ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత.. వీరిద్దరు ఝార్ఖండ్​ బొకారోలోని ఓ హోటల్​లో కలిశారు. అప్పుడే.. ఫుడ్​లో డ్రగ్స్​ కలిపి ఆమెకు ఇచ్చాడు నిందితుడు. అనంతరం ఆమెను రేప్​ చేసి, ఆ దృశ్యాలను వీడియో తీశాడు. వాటిని అడ్డం పెట్టుకుని, తనను భౌతికంగా కలవాలని 23ఏళ్ల మహిళను ఒత్తిడి చేసేవాడు. చివరికి.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. తాజాగా.. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఝార్ఖండ్​ బొకారా జిల్లా కోర్టు.. అతనికి 15ఏళ్ల జైలు శిక్షాను విధించింది. రూ.25వైల జరిమానా కూడా వేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం