తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024: నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చూసుకోండి..

NEET UG 2024: నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చూసుకోండి..

HT Telugu Desk HT Telugu

Published Jun 04, 2024 06:05 PM IST

google News
  • NEET UG 2024 Results: నీట్ యూజీ 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4, మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షను మే 5న నిర్వహించారు. నీట్ యూజీ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి, స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడి

నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడి

NEET UG 2024 Results: వైద్య విద్య కు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలను జూన్ 4, 2024 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024) కు హాజరైన అభ్యర్థులందరూ న్ టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET ఎ ద్వారా స్కోర్ కార్డులను చెక్ చేసుకోవచ్చు. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను కూడా neet.ntaonline.in తెలుసుకోవచ్చు.

స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి

నీట్ యూజీ 2024 స్కోర్లను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్కోర్ కార్డులను చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవడానికిి కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ యూజీ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది
  • రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

మే 5 న పరీక్ష

ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షను 2024 మే 5న దేశవిదేశాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించారు.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (యూజీ)-2024ను 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 29న విడుదల చేయగా, 2024 జూన్ 1న అభ్యంతరాల విండోను మూసివేశారు. తుది ఆన్సర్ కీని 2024 జూన్ 3న విడుదల చేశారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం