NEET UG result 2024 : నీట్ యూజీ ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే..
NEET UG result: నీట్ యూజీ ఫలితాలు ఇంకొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఫలితాల తేదీ వివరాలను ఇక్కడ చూడండి..
Neet result 2024 date : అండర్ గ్రాడ్యుయేట్ లేదా నీట్ యూజీ 2024 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో ప్రకటించనుంది. మే 5న పరీక్ష నిర్వహించగా, మే 29న ప్రొవిజనల్ ఆన్సర్ కీని ప్రచురించారు. ఫలితాలను exams.nta.ac.in/NEET లో ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడినప్పుడు.. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి మార్కులను చెక్ చేసుకోవచ్చు.
నీట్ ఫలితాల తేదీ..
అధికారిక సమాచారం ప్రకారం.. నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 14న ప్రకటిస్తారు. పరీక్ష తుది ఆన్సర్ కీని ఫలితాలతో పాటు విడుదల చేస్తారు.
Neet UG results 2024 : ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన అనంతరం ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లింపుతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది ఎన్టీఏ. అభ్యర్థులు చేసిన సవాళ్లను సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, సరైనదే అని తేలితే తుది కీలో సమాధానాన్ని సవరిస్తామని తెలిపింది. ఫైనల్ ఆన్సర్ కీని సవాలు చేయలేమని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- IBPS notifications : నిరుద్యోగులకు అలర్ట్- త్వరలోనే ఐబీపీఎస్ పీవో, క్లర్క్ నోటిఫికేషన్లు విడుదల..
నీట్ ఫలితాలు 2024: కటాఫ్ మార్కులు
నీట్ యూజీ కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు కేటగిరీల వారీగా పంచుకుంటుంది ఎన్టీఏ. 2022లో నీట్ యూజీ కటాఫ్లు మూడేళ్ల కనిష్టానికి పడిపోయినా 2023లో అన్ని కేటగిరీలకు పెరిగాయి.
అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్: 720-137 మార్కులు (50వ పర్సంటైల్)
How to check Neet UG results : ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ: 136-107 మార్కులు (40వ పర్సంటైల్)
యూఆర్/ఈడబ్ల్యూఎస్ అండ్ పీహెచ్: 136-121 (45వ పర్సంటైల్)
ఓబీఈ/ఎస్సీ+పీహెచ్: 120-107 (40వ పర్సంటైల్) ఎస్టీ+పీహెచ్: 120-107 (40వ పర్సంటైల్) ఎస్టీ+పీహెచ్: 120-108 (40వ పర్సంటైల్)
గతేడాది.. తమిళనాడుకు చెందిన ప్రభంజన్ జె, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరా వరుణ్ చక్రవర్తి నీట్ యూజీ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
సంబంధిత కథనం