AP SET 2024 Results : ఏపీ సెట్ ఫలితాలు విడుదల, స్కోర్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
AP SET 2024 Results : ఏపీ సెట్ ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
AP SET 2024 Results : ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ సెట్ ఫలితాలు మే 24న విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు లేదా లెక్చరర్‌ల ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఏపీ సెట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 8 ప్రాంతీయ కేంద్రాల్లో 30 సబ్జెక్టులకు ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించారు. ఏపీ సెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.apset.net.in లో ఫలితాలు, స్కోర్ కార్డు, కటాఫ్ మార్కులను చెక్ చేసుకోవచ్చు. మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది ఏపీ సెట్ కు మొత్తం 30,448 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మే 2న ప్రాథమిక కీని విడుదల చేశారు. ఫలితాలతో పాటు ఫైనల్ కీను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
ఏపీసెట్ ఫలితాల్లో మొత్తం 2444 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులను (రెండు పేపర్లు కలిపి) పొందితే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులు కనీసం 35% మొత్తం మార్కులు (రెండు పేపర్లు కలిపి) సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ పోస్టులకు స్టెప్-1 అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
ఏపీ సెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
- Step 1: ఏపీ సెట్ అధికారిక వెబ్‌సైట్ https://apset.net.in/ పై క్లిక్ చేయండి.
- Step 2: హోమ్‌పేజీలో 'Results 2024' లింక్‌పై క్లిక్ చేయాలి.
- Step 3: ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏపీ సెట్ 2024 ఫలితాలపై క్లిక్ చేయండి.
- Step 4: ఆ తర్వాత ఏపీసెట్ 2024 ఫలితాల PDF ఓపెన్ అవుతుంది.
- Step 5: అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- Step 6: భవిష్యత్తు సూచన కోసం అభ్యర్థులు ఫలితాలను ప్రింట్ తీసుకోవచ్చు.
ఏపీ సెట్ స్కోర్ కార్డు డౌన్ లోడ్ ఎలా?
- Step 1: ఏపీలో అధికారిక వెబ్‌సైట్ https://apset.net.in/ పై క్లిక్ చేయండి.
- Step 2: వెబ్‌సైట్ హోమ్‌పేజీలో Score Card లింక్‌పై క్లిక్ చేయాలి.
- Step 3: ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- Step 4: ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అభ్యర్థి స్కోర్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
- Step 5: అభ్యర్థులు స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కీ విడుదల
ఏపీ ఈఏపీసెట్ 2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదలైంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి ప్రిలిమినరీ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 26వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని కూడా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.