AP SET Syllabus 2024 : ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP SET-2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఏడాది ఏపీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తుంది. ఏప్రిల్ 28న ఏపీ సెట్ పరీక్షను నిర్వహంచనున్నారు. జనరల్ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. https://apset.net.in వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
- ఏపీ సెట్(AP SET 2024) ను 1 పేపర్లలో నిర్వహిస్తారు.
-పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
-పేపర్- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది.
-సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు.
పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
-మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
-ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు.
-జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
-సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.
https://apset.net.in వెబ్ సైట్ లోకి వెళ్లి మీ దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు.మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ పరీక్షను నిర్వహంచనున్నారు.