AP SET 2024 Hall Tickets : ఏపీ సెట్ హాల్ టికెట్లు విడుదల, ఏప్రిల్ 28న ఎగ్జామ్
AP SET 2024 Hall Tickets : ఏపీ సెట్-2024 హాల్ టికెట్లు జారీ అయ్యాయి. అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP SET 2024 Hall Tickets : ఏపీ సెట్-2024(AP SET-2024) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఈ-మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సెట్ పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందాలంటే సెట్ అర్హత తప్పనిసరి. ఏటా సెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది.
ఏపీ సెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?(How To Download AP SET Hall Ticket)
Step 1 : ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP SET 2024) అధికారిక వెబ్‌సైట్ https://apset.net.in/ ను సందర్శించండి
Step 2 : సైట్ స్క్రోల్ అవుతున్న 'అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్' లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3 : లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు ఈ-మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
Step 4 : తర్వాత పేజీలో మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
Step 5 : ఏపీ సెట్ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోంది. భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకోండి.
ఏపీ సెట్ పరీక్ష విధానం
ఏపీ సెట్(AP SET 2024) ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది. సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్ష జరుగుతుంది. ఏపీలోని విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు పరీక్ష కేంద్రాల్లో సెట్ నిర్వహిస్తారు.
ఏపీ గురుకుల ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల
ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే APRS CAT(Andhra Pradesh Residential Educational Institutions Society Common Admission Test) పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://aprs.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతిలో అడ్మిషన్లు కల్పించటంతో పాటు జూనియర్ కాలేజీ, డిగ్రీ ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం