AP Gurukula Hall Tickets 2024 : ఏపీ గురుకుల ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP Gurukula Admissions 2024 Updates : ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://aprs.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25వ తేదీన ఎగ్జామ్ ఉంది.
AP Residential Educational Institutions Admissions 2024: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే APRS CAT(Andhra Pradesh Residential Educational Institutions Society Common Admission Test) పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://aprs.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతిలో అడ్మిషన్లు కల్పించటంతో పాటు జూనియర్ కాలేజీ, డిగ్రీ ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు.
APRS CAT Hall Tickets Download 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- ముందుగా https://aprs.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో 5వ తరగతి, 6,7,8,9 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ ప్రవేశాల ఆప్షన్లు కనిపిస్తాయి.
- అభ్యర్థి ఏ తరగతి ప్రవేశం కోసం అయితే దరఖాస్తు చేసుకున్నాడో ఆ ఆప్షన్ పై లింక్ చేయాలి.
- మీకు మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ Candidate ID, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై నొక్కాలి. మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి మీ హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ 2024, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్డీసీ 2024, మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రవేశాల కోసం APRS CAT - 2024ను నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయా తరగతుల్లో అడ్మిషన్లు ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరగనుంది.
తెలంగాణలో గురుకుల ప్రవేశాల ఫలితాలు
TS Gurukulam 5th Class Results 2024 : తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్(TS Gurukul CET) నోటిఫికేషన్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన ఈ ఎగ్జామ్ జరగా… తాజాగా ఫలితాలను ప్రకటించింది గురుకుల బోర్డు. https://tgcet.cgg.gov.in/ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఎస్సీ,ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష(TS Gurukul CET Results) నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించి 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఇలా చెక్ చేసుకోండి
- మొదటగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Hall Ticket Number లేదా మీ మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- - ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.