TS Polycet Results 2024 : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
TS Polycet Results 2024 : తెలంగాణ పాలిసెట్-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
TS Polycet Results 2024 : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పాలిసెట్-2024 ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24 పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. వీటి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షను 82,809 మంది విద్యార్థులు రాశారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1 : అభ్యర్థులు పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ పై క్లిక్ చేయండి.
Step 2 : హోంపేజీలోని ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 : ఆ తర్వాత పేజీలో లాగిన్ వివరాలు నమోదు చేయండి. రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్... పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
Step 4 : ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు
TS Polycet Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 22వ తేదీ నుంచి మొదటి ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జులై 7వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13న సీట్లు కేటాయించనున్నారు. జులై 23న స్పాట్ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జులై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
AP Polycet Counselling Schedule 2024: ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. ఏపీలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. జూన్ 3న నిర్వహించాల్సిన ధ్రువపత్రాల పరిశీలనను జూన్ 6వ తేదీకి మార్చారు. జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 11వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. జూన్ 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. జూన్ 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలిసెట్ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. విద్యార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ మార్పులను గమనించాలని విద్యాశాఖ కోరింది.
సంబంధిత కథనం