తెలుగు న్యూస్  /  National International  /  Navale Bridge Accident: Truck Driver Turned Off Engine To Save Fuel, Say Police

Navale Bridge accident: ఇంజిన్ ఆఫ్ చేయడం వల్లనే ప్రమాదం

HT Telugu Desk HT Telugu

22 November 2022, 21:41 IST

  • Navale Bridge accident: పుణె- బెంగళూరు హైవేపై జరిగిన ఘోర ప్రమాదానికి కారణం డ్రైవర్ తప్పిదమేనని తేలింది. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్, అతడి అసిస్టెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పుణె, బెంగళూరు హైవేపై ప్రమాద దృశ్యం
పుణె, బెంగళూరు హైవేపై ప్రమాద దృశ్యం

పుణె, బెంగళూరు హైవేపై ప్రమాద దృశ్యం

Navale Bridge accident:పుణె, బెంగళూరు హైవేపై నావలే బ్రిడ్జి వద్ద సోమవారం జరిగిన భారీ ప్రమాదానికి కారణాన్ని గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్, క్లీనర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Pune- Bengaluru highway accident: అసలేం జరిగింది?

పుణె, బెంగళూరు హైవేపై సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న ట్రక్ ఇంజిన్ ను డ్రైవర్ అకస్మాత్తుగా ఆఫ్ చేశాడు. రోడ్డు వాలుగా ఉండడంతో డీజిల్ ను పొదుపు చేసే ఉద్దేశంతో డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. దాంతో, వాహనం బ్రేక్స్ పని చేయలేదు. దాంతో డ్రైవర్ ట్రక్ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. రోడ్డు వాలుగా ఉండడంతో, ట్రక్ మరింత వేగం పుంజుకుని ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకువెళ్లింది. అలా, వేగంగా వెళ్తున్న వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొని గుట్టలా పడిపోయాయి. ప్రమాదం అనంతరం మధ్య ప్రదేశ్ కు చెందిన డ్రైవర్ మణిరాం చోటేలాల్ యాదవ్, అతడి అసిస్టెంట్ అక్కడి నుంచి పారిపోయారు.

Pune- Bengaluru highway accident: 48 వాహనాలు

ఈ ప్రమాదంలో దాదాపు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనదారులు గాయపడ్డారు. పలువురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై RTO అధికారులు, పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. వాహనం వెళ్తుండగా ఇంజిన్ ను ఆఫ్ చేయడమే ప్రమాద కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ను, అతడి సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనం వెళ్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంజిన్ ఆఫ్ చేయకూడదని ఈ సందర్భంగా RTO అధికారులు సూచిస్తున్నారు. అయితే, ఇది ప్రాథమిక నిర్ధారణ మాత్రమేనని, సమగ్ర విచారణ అనంతరం సరైన కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే పరిశీలించారు. రోడ్డు చాలా వాలుగా ఉండడం వల్ల, వాహనాల వేగం నియంత్రణలోకి రావడం లేదని, గతంలోనూ ఇక్కడ ప్రమాదాలు జరిగాయని సుప్రియ వివరించారు. ఈ విషయాన్ని తాను కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు.

టాపిక్