తెలుగు న్యూస్  /  National International  /  'My Replacement...' : What Boris Johnson Said On Rishi Sunak, India At Htls 2022

Boris Johnson at HTLS 2022: ‘‘మహిళా ప్రధానుల విషయంలో మీ కన్నా మేమే బెటర్’’

HT Telugu Desk HT Telugu

12 November 2022, 15:37 IST

  • Boris Johnson at HTLS 2022: బ్రిటన్ మాజీ ప్రధాని శనివారం హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ -2022(Hindustan Times Leadership Summit-2022)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బ్రిటన్ రాజకీయాల్లో పెరుగుతున్న ‘భారతీయత’ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ -2022లో ప్రసంగిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ -2022లో ప్రసంగిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ -2022లో ప్రసంగిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson at HTLS 2022: హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ -2022(Hindustan Times Leadership Summit-2022)లో బోరిస్ జాన్సన్ కీలక ఉపన్యాసం చేశారు. బ్రిటన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ ను ప్రస్తావిస్తూ.. బ్రిటన్ పీఎంగా తన ప్రత్యామ్నాయంగా వచ్చిన వ్యక్తి కూడా భారతీయ సంతతి వాడేనని Boris Johnson గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Boris Johnson at HTLS 2022: రుషి సునక్ పై..

హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్(Hindustan Times Leadership Summit-2022) లో బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాలు, కొరోనా వైరస్ మహమ్మారి, చైనా, ప్రాంతీయ రాజకీయాలపై మాట్లాడారు. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వ్యక్తి((Rishi Sunak) బ్రిటన్ ప్రధాని కావడంపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ‘అది చాలా గొప్ప విషయం.. మా కన్సర్వేటివ్ పార్టీ ఆధునికతకు పెద్ద పీట వేస్తుంది. మీకో విషయం తెలుసా? మహిళా ప్రధానుల విషయంలో భారత్ కన్నా మేమే ముందున్నాం. మాకు ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ప్రధానులుగా పని చేశారు’ అని Boris Johnson వ్యాఖ్యానించారు.

Boris Johnson at HTLS 2022: భారతీయ విద్యార్థులు

యూకేలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికమని జాన్సన్ గుర్తు చేశారు. ‘1.8 లక్షల మంది భారతీయ విద్యార్థులు( ప్రస్తుతం యూకే విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్నారు’ అన్నారు. గతంలో ప్రధానిగా తాను భారత్ వచ్చినప్పుడు తనకు అద్భుతమైన స్వాగతం లభించిందని Boris Johnson తెలిపారు. ‘అంత అద్భుతమైన స్వాగతం నాకు మరెక్కడా లభించలేదు. గుజరాత్ లో అయితే, నాకు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కు స్వాగతం పలికిన స్థాయిలో వెల్ కమ్ చెప్పారు’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

Boris Johnson at HTLS 2022: చైనా(China)ను విస్మరించలేం

అంతర్జాతీయంగా చైనా(China)ను విస్మరించలేని స్థితిలో ఆ దేశం ఉందని జాన్సన్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో ఐదో వంతు అక్కడే ఉంది. యూకే, భారత్ సహా చాలా దేశాలు చైనాతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. చైనాతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, జాగ్రత్తగానూ ఉండాలి’ అని జాన్సన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా భారీగా నష్టపోతుందని, ఆ మేరకు చైనా లాభపడుతుందని బోరిస్ జాన్సన్(Boris Johnson) అభిప్రాయపడ్డారు.

టాపిక్