తెలుగు న్యూస్  /  National International  /  Missing Teen From Arunachal Pradesh To Be Handed Over Soon

భారత యువకుడిని అప్పగించనున్న చైనా సైన్యం

HT Telugu Desk HT Telugu

26 January 2022, 17:21 IST

    • Arunachal teen missing case | వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని.. చైనా పీఎల్​ఏ త్వరలో భారత్​కు అప్పగించనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్​ రిజిజు ట్వీట్​ చేశారు.
ఆ భారత యువకుడిని విడుదల చేయనున్న చైనా
ఆ భారత యువకుడిని విడుదల చేయనున్న చైనా (hindustan times)

ఆ భారత యువకుడిని విడుదల చేయనున్న చైనా

China PLA India | చైనా సైనికుల వద్ద ఉన్న అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు త్వరలోనే దేశానికి తిరిగి రానున్నాడు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్​ రిజిజు బుధవారం వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

"రిపబ్లిక్​ డే సందర్భంగా భారత సైన్యం- చైనా పీఎల్​ఏ మధ్య సంభాషణ జరిగింది. అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని అప్పగించేందుకు పీఎల్​ఏ సానుకూలంగా స్పందించింది. విడుదల చేసేందుకు ఓ ప్రాంతాన్ని సూచించింది. ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం త్వరలో తెలుస్తుంది," అని రిజిజు ట్వీట్​ చేశారు.

అపహరించారా.. అదృశ్యమయ్యాడా?

ఈ నెల 18న.. అరుణాచల్​ప్రదేశ్​ షియాంగ్​లోని సియుంగ్లాలో మిరామ్​ తారోన్​ అనే 17ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్​ అదృశ్యమవ్వలేదని, పీఎల్​ఏ(పిపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) అతడిని అపహరించిందని అరుణాచల్​ప్రదేశ్​లోని బీజేపీ ఎంపీ తాపిర్​ గావో ఆరోపించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్​ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తరోన్​ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్​ఏకు అధికారులు ఇచ్చారు.