Woman found dead inside python : కొండచిలువ కడుపులో మహిళ మృతదేహం.. 3 రోజుల ముందు అదృశ్యమై!
09 June 2024, 12:58 IST
- ఇండోనేషియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 రోజుల ముందు ఓ మహిళ అదృశ్యమైంది. కాగా.. ఓ భారీ కొండచిలువ కడుపులో ఆమె మృతదేహం కనిపించింది.
కొండచిలువ కడుపులో మహిళ మృతదేహం..
Indonesia woman found inside python : ఇండోనేషియాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల ముందు అదృశ్యమైన ఓ మహిళ మృతదేహం, ఓ భారీ కొండచిలువ కడుపులో కనిపించింది!
ఇదీ జరిగింది..
సెంట్రల్ ఇండోనేషియాలోని సౌత్ సులేవెసి రాష్ట్రంలో ఉండే కలెంపంగ్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నలుగురు పిల్లల తల్లి అయిన ఆ మహిళ.. గత గురువారం రాత్రి కనిపించకుండా పోయింది. భయాందోళనకు గురైన ఆమె భర్త.. స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాడు. రెండు రోజుల వరకు మహిళకు సంబంధించి ఎలాంటి సమాచారం దక్కలేదు.
ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో.. చివరికి, గ్రామస్తులకు.. 16 అడుగుల భారీ కొండచిలువ ఒకటి కనిపించింది. దాని పొట్ట భాగం చాలా లావుగా ఉంది. అనుమానంతో.. కొండచిలువ పొట్ట భాగాన్ని కట్ చేయాలని స్థానికులు నిర్ణయించుకున్నారు.
Indonesia pythons : కొండచిలువ పొట్టను కట్ చేయగా.. స్థానికులందరు షాక్‌కు గురయ్యారు. పొట్ట భాగంలో మహిళ తల కనిపించింది. బయటకి లాగగా.. బట్టలతో సహా మహిళ మృతదేహం వచ్చింది.
ఆ మహిళ పేరు ఫరిదా అని సమాచారం. ఆమె వయస్సు 45ఏళ్లని తెలుస్తోంది.
ఈ వార్త ఇండోనేషియా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మహిళను కొండచిలువ మింగేసిందన్న వార్త ఇప్పుడు వార్తలకెక్కింది.
ఇలా.. మనిషి శరీరం మొత్తాన్ని కొండచిలువ మింగేయడం అరుదైన ఘటన. కానీ.. ఇండోనేషియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా.. గ్రామాల్లోని ప్రజలు భయంభయంగా జీవిస్తున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. వార్తను చూసిన వారందరు.. షాక్ అవుతున్నారు.
Indonesian pythons latest news : ఆగ్నేయ సులావెసిలోని ఓ గ్రామంలో.. ఓ రైతును తింటూ ఓ 8 మీటర్ల భారీ కొండచిలువ కనిపించింది. దానిని స్థానికులు కొట్టి చంపేశారు.
2018లో.. మునా పట్టణంలో ఓ 54ఏళ్ల మహిళ 7 మీటర్ల కొండచిలువ కడుపులో కనిపించింది.
2017లో.. పశ్చిమ సులవెసిలోని ఓ గ్రామంలో ఓ రైతు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతడిని.. ఓ 4 మీటర్ల కొండచిలు సజీవంగా తింటూ కనిపించింది.
ఈ దేశంలో చూద్దామన్నా ఒక్క పాము కనిపించదు..!
No Snakes Country : న్యూజిల్యాండ్‌లో ఒక్క పాము కూడా కనిపించదు! వాటిపై నిషేధం ఉంది. న్యూజిలాండ్ మినహా ప్రపంచంలోని అన్ని చోట్లా పాములు కనిపిస్తాయి. దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న ఈ దేశంలో పాములు ఉండవు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేశ భూభాగం చుట్టూ పాములు కనిపిస్తాయి. ఈ దేశం చుట్టూ సముద్రం ఉంటుంది. కానీ దేశంలో ఎక్కడా పాము కనిపించదు. ఆశ్చర్యకరంగా ఈ దేశంలోని జంతుప్రదర్శనశాలలలో కూడా మీరు పాములను చూడలేరు. పాములను ఉంచడం, విదేశాల నుంచి పాములను తీసుకురావడం కూడా ఇక్కడ నిషేధం. న్యూజిలాండ్‌లో ప్రతి జంతువు, పక్షులకు రక్షణ కోసం చర్యలు తీసుకుంటారు. జంతువుల రక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.