తెలుగు న్యూస్ / ఫోటో /
Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు: 50 మంది దుర్మరణం
- Indonesia Floods: ఇండోనేషియాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

(1 / 6)
ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి 58 మంది మృతి చెందగా, మరో 35 మంది గల్లంతయ్యారు.(AFP)
(2 / 6)
గల్లంతైనవారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో రోడ్లు మురికి గోధుమ రంగు నదులుగా మారాయి. గ్రామాలు దట్టమైన బురద, రాళ్ళు, నేలకూలిన చెట్లతో నిండి కనిపిస్తున్నాయి.(AFP)
(3 / 6)
భారీ వర్షాల కారణంగా మరాపి పర్వతం నుండి కిందనున్న గ్రామాలపైకి పెద్ద ఎత్తున బురద కొట్టుకువచ్చింది. కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తూ, జనావాసాల్లోకి వస్తున్నాయి.(AFP)
(4 / 6)
ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రాలోని తానాహ్ దాతర్ లో ఆకస్మిక వరద బాధితుడి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది తీసుకెళ్తున్నారు.(AP)
ఇతర గ్యాలరీలు